ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కు కరోనా సోకి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత నాలుగు రోజులుగా ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 75 శాతం ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. శివ శంకర్ మాస్టర్ పెద్ద కొడుకు కూడా కరోనా సోకి సీరియస్ అయ్యి అపస్మారక స్థితిలో ఉన్నారు. శివ శంకర్ మాస్టర్ భార్య కరోనాతో హోమ్ క్వారెంటైన్ లో ఉన్నారు. చిన్నకొడుకు అజయ్ కృష్ణ ఒక్కడే ప్రస్తుతం తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు.
శివ శంకర్ మాస్టర్ కు చికిత్స అందించడం కష్టమవుతోంది. రోజుకు లక్షల రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చు అవుతోంది.. ఎన్నో గొప్ప పాటలకు నృత్యాలను సమకూర్చి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శివ శంకర్ మాస్టర్ కు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరం. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం