సూర్య హీరోగా నటించిన తమిళ చిత్రం ‘సూరారైపోట్రు’ అద్భుతమైన విజయం సాధించింది. ‘గురు’ ఫేమ్ సుధాకొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం 93వ ఆస్కార్ నామినేషన్ బరిలో కూడా నిలిచింది. కెప్టెన్ గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ ‘సూరారైపోట్రు’ తెలుగులో ‘ఆకాశం నీహద్దురా’గా ఈ వ్యూయర్స్ ముందుకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను హిందీ రీమేక్ చేయాలని సుధా కొంగర డిసైడ్ అయ్యారు. సూర్య ప్రొడక్షన్ హౌస్ 2డీ ఎంటర్టైన్మెంట్స్, అబుండాంటియా (హిందీలో విద్యాబాలన్ ‘షేర్నీ’ చిత్రాన్ని నిర్మించారు) సంస్థలు ‘సూరారైపోట్రు’ సిని మాను హిందీలో రీమేక్ చేయనున్నాయి. హిందీ రీమేక్‌కు కూడా సుధా కొంగరాయే దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తుంది.
మరి..‘సూరారైపోట్రు’ హిందీ రీమేక్‌లో హీరోగా సూర్య నటిస్తారా? లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. బీ టౌన్లో మాత్రం ప్రస్తుతానికి అక్షయ్‌కుమార్ పేరు బలంగా వినిపిస్తుంది. అయితే అక్షయ్ చేతిలో కంప్లీట్ చేయాల్సిన సినిమాలు దాదాపు 8కిపైగానే ఉన్నాయి. ఇటు ప్రస్తుతం సూర్య చేతిలో కూడా మూడు కమిటెట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి…హిందీ రీమేక్‌లో సూర్య నటిస్తారా? లేక అక్షయ్ హీరోగా కనిపి స్తారా? అనే విషయంపై త్వరలో స్పష్టత రానున్నట్లు తెలుస్తుంది.