అజిత్ హీరోగా నటించిన ‘వలిమై’ పోస్టర్ కోసం సోషల్ మీడియాలో అజిత్ ఫ్యాన్స్ చేసిన రిక్వెస్ట్స్ ఇప్పటివీ కావు. ఎప్పట్నుంచో ‘వలిమై’ ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేయాలని ఈ చిత్రం దర్శకుడు హెచ్ వినోద్, నిర్మాత బోనీకపూర్‌ను అభిత్ ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో అడుగుతూనే ఉన్నారు. ఎట్టకేలకు అజిత్ అభిమానుల నిరీక్షణ ఫలించింది. సడన్ సర్ప్రైజ్గా ఆదివారం ‘వలిమై’ మోషన్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు. రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ‘వలిమై’ సినిమా ఉంటుందని తెలుస్తుంది. వలిమై మోషన్ పోస్టర్ ద్వారా ఈ చిత్రం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. అలాగే ‘పవర్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్’ అని మోషన్ పోస్టర్లో ఉండటాన్ని బట్టి ఈ సినిమా ఫుల్ప్యాక్డ్ యాక్షన్ మూవీగా ఉండనుందని తెలుస్తుంది. ‘వలిమై’ చిత్రంలో హీరోయిన్గా హ్యూమా ఖురేషీ కనిస్తే…విలన్ ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ నటించారు. ఇప్పటికే హీరో అజిత్, హెచ్ వినోద్ కాంబినేషన్లో ‘నేర్కొండ పరవై’ (హిందీ హిట్ ‘పింక్’ సినిమా తమిళ రీమేక్) వచ్చింది. ఇప్పుడు ‘వలిమై’. వలిమై విడుదలైన వెంటనే అజిత్, హెచ్ వినోద్ కాంబినేషన్లో మరో సినిమా కూడా సెట్స్‌పైకి వెళుతుందనే టాక్ కోలీవుడ్‌లో బలంగా వినిపిస్తుంది.