రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోని విలన్ పాత్రను చేయడానికీ అంగీకరించారు ఆది పినిశెట్టి. ‘అజ్ఞాతవాసి’, ‘సరైనోడు’ చిత్రాల తర్వాత ఆది పినిశెట్టి పుల్‌లెంగ్త్ విలన్ రోల్ చేస్తున్న చిత్రం ఇది. ‘‘లింగుసామీ కథ చెప్పిన వారం రోజుల తర్వాత ఈ సినిమాలో విలన్ పాత్ర చేయాలని డిసైడ్ అయ్యాను. తెలుగులో కడప బ్యాక్‌డ్రాప్‌లో, తమిళంలో మధురై బేస్డ్‌గా ఈ కథ ఉంటుంది. హీరోగా సినిమాలు చేస్తూనే వీలైనప్పుడు కథ నచ్చితే విలన్ పాత్రలూ చేస్తాను’’ అని ఆది పినిశెట్టి అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదారాబాద్‌లో జరుగుతుంది. ‘ఉప్పెన’ ఫేమ్ కృతీశెట్టి ఈ సినిమాలో హీరోయిన్
రామ్‌కు ఇతడే విలన్
Leave a comment
Leave a comment