ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్‌బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ రెండో వివాహం చేసుకున్నారు. 2015లో ప్రణతిరెడ్డిని ప్రేమవివాహం చేసుకున్నారు మంచు మనోజ్. కానీ ఈ ఇద్దరు 2019లో విడాకులుతీసుకున్నారు. అప్పట్నుంచి సింగిల్‌గానే ఉంటున్నారు మంచు మనోజ్. అయితే రీసెంట్గా దివంగత శాసన సభ్యులు భూమానాగిరెడ్డి, భూమా శోభరాణిల ద్వీతీయ పుత్రిక భూమా మౌనికారెడ్డితో మంచు మనోజ్ ప్రేమలో పడ్డారు.
ఇటీవల పలు సందర్భాల్లో వీరద్దరు జంటగా రావడం కూడా హాట్‌టాపిక్‌గా మారింది. అప్పట్లోనే మనోజ్, మౌనికలు వివాహం చేసుకోనున్నారన్న వార్తలు వినిపించాయి. తాజా ఆ వార్తలు నిజం అయ్యాయి. ఈ ఇద్దరు మార్చి 3న హైదరాబాద్‌లో ఏడడుగులు వేశారు. మనోజ్ సోదరి మంచు లక్ష్మీ నివాసంలో మనోజ్, మౌనికల వివాహం జరిగింది. ఈ వివాహంలో పలువురు సినీ, రాజకీయప్రముఖులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
ఇక సినిమాల విషయానికి వస్తే..దాదాపు ఆరు సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న మనోజ్ రీసెంట్గా ‘వాట్ ది ఫిష్’కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. గతంలో ఆయన ‘అహం బ్రహ్మాసీ’ అనే సినిమాకూ ఒకే చెప్పారు. కానీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు.