

వెంకటేశ్ హీరోగా నటించిన ‘నారప్ప’ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుందనే వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వాళ్లు సినిమాలను ఈ ఏడాది అక్టోబరు వరకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఇవ్వొద్దని నిర్మాతలను రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీని ‘నారప్ప’ చిత్ర నిర్మాత డి. సురేష్‌బాబు వెనక్కితగ్గలేదు. ‘నారప్ప’ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌పామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సోమవారం అధికారికంగా ప్రక టించారు. తమిళంలో హిట్ సాధించిన అసురన్‌కు తెలుగు రీమేక్‌గా రూపొందిన ‘నారప్ప’ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. మరోవైపు వెంకటేశ్ హీరోగా నటించిన ‘దృశ్యం 2’ (మలయాళ ‘దృశ్యం 2’కు తెలుగు రీమేక్) కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే విడుదల కానుందనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ చిత్రం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందనే వార్తలు వస్తున్నాయి.