ఇండియన్ సినిమా చరిత్రలో కేజీఎఫ్: చాప్టర్ 1 ఓ సంచలనం. ఏ అంచనాలు లేకుండానే 2018లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. బాలీవుడ్లో షారుక్‌ఖాన్ నటించిన ‘జీరో’ సినిమా, కేజీఎఫ్ చాప్టర్ 1…ఒకే రోజు విడుదలైతే…బాలీవుడ్ బాక్సాఫీసును కూడా కొల్లగొట్టింది కేజీఎఫ్ చిత్రమే. ఆ మాటకోస్తే..బాలీవుడ్లోనే కాదు…ఇటు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్
లోనూ కేజీఎఫ్ విజయ «ధ్వానాలు గట్టిగానే వినిపించాయి. దీంతో ఇప్పుడు హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లోనే వస్తున్న ‘కేజీఎఫ్: చాప్టర్ 2’పై కూడ భారీ అంచనాలు ఉన్నాయి. యశ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్‌కు గంటల్లోనే 120 మిలియన్ వ్యూస్‌ను దాటేసింది. కరోనా వల్ల ఈ సినిమా పలుమార్లు వాయిదా పడినా కూడా ఈ సినిమాపై ఉన్న హైప్, క్రేజ్ సినిమా లవర్స్‌లో ఏ మాత్రమూ తగ్గలేదు సరి కదా! పెరిగిందనడానికి ఇదో నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కేజీఎఫ్: చాప్టర్ 2 ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ అద్భుతంగా ఉంది. యశ్ స్టైల్ ఆఫ్ యాక్షన్ స్పష్టంగా కనిపిస్తోంది.
కేజీఎఫ్ చాప్టర్1 సక్సెస్‌ను దృష్టిలో ఉంచుకుని కేజీఎఫ్ 2 చిత్రంలోని నటీనటుల విషయంలో జాగ్రత్త పడ్డారు ప్రశాంత్ నీల్. బాలీవుడ్ నుంచి సంజయ్‌దత్, రవీటాండన్, టాలీవుడ్ నుంచి రావురమేష్, ప్రకాశ్ రాజ్..ఇలా అన్నీ ఇండస్ట్రీల నటీనటులను కలుపుకునే ప్రయత్నం చేశారు ప్రశాంత్ నీల్. భారీ బడ్జెట్‌తో విజయకరగందూర్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్యాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోన్న ఈ సమయంలో కేజీఎఫ్ ఎంతటి వసూళ్లు సాధిస్తుందో అన్న విషయంపై అందరు ఆసక్తిగానే ఉన్నారు.