దర్శకుడు రాజమౌళితో సినిమా అనగానే ఏ హీరో అయినా వెంటనే ఒకే చెప్పేస్తారు. కానీ ఇప్పుడు మాత్రం ఒకటికి రెండు సార్లు తప్పక ఆలోచిస్తారు. కంటెంట్ అండ్ క్వాలిటీ విషయంలో అయితే కాదు కానీ. ..సినిమా రిలీజ్ విషయంలో. ప్రజెంట్ రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ నాలుగోసారి వాయిదా పడింది. జనవరి 07న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఇంతకుముందు 2020 జూలై 30, 2021 జనవరి 8, 2021 అక్టోబరు 13 తేదీల్లో విడుదలకు షెడ్యూల్ అయిన ఆర్ఆర్ఆర్ వాయిదా పడ్డ విషయం సినీ లవర్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది.
ప్రభాస్‌తో రాజమౌళి తీసిన ‘బాహుబలి’ తీశారు. ఈ రెండు పార్టుల బాహుబలి పూర్తి కావడానికి ఐదు సంవత్సరాలు పట్టింది. అంటే ఐదు సంవత్సరాల్లో ప్రభాస్ చేసింది రెండే సినిమాలు. ఎప్పుడైతే ‘బాహుబలి’ ప్రపంచం నుంచి ప్రభాస్ భయటకు వచ్చాడో వరుస సినిమాలతో ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా ఐదు సినిమాలు చేస్తున్నాడు. టైమ్ పరంగా చూసుకుంటే బాహుబలి ఎంత కలెక్ట్ చేసిందో ప్రభాస్ ఈ ఐదు సినిమాలను ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాడు. ఈ ప్రకారం చూసుకుంటే ఈ ఐదు సినిమాల కలెక్షన్స్ బాహుబలి కంటే ఎక్కువగానే వస్తాయనడంలో సందేశం లేదు. పైగా ఏడాదికోసారైనా స్క్రీన్‌పై కనిపిస్తే ఇటు ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీలవుతారు. రాజమౌళితో సినిమా స్టార్స్‌కు స్టార్డమ్ పరంగా వరమైతే..ఫ్యాన్స్‌కు మాత్రం శాపమే అని చెప్పాలి.
అప్పుడు ప్రభాస్‌కు ఏం జరిగిందో ఇప్పుడు ఎన్టీఆర్‌కు అదే జరుగుతుంది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఒక హీరో అయిన ఎన్టీఆర్ సిల్వర్‌స్క్రీన్‌పై కనిపించి దాదాపు మూడున్నర సంవత్సరాలు అవుతుంది. 2018 దసరా సమయంలో వచ్చిన అరవిందసమేత వీరరాఘవ చిత్రం తర్వాత ఎన్టీఆర్ మళ్లీ వెండితెరపై కనిపించలేదు. పోనీ ఆర్ఆర్ఆర్ కాకుండా ఎన్టీఆర్ కమిటైన మరో చిత్రం కూడా రిలీజ్‌కు సిద్ధంగా లేదు. రిలీజ్ విషయం పక్కన పెడితే అసలు షూటింగ్గే స్టార్ట్ కాలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమా కొరటాల శివతో సినిమా పూర్తి చేయాలన్న కనీసం ఏడాది పడుతుంది. ఈ ప్రకారం చూసుకున్న ఎన్టీఆర్ వెండితెరపై కనిపించేది 2023లోనే. కానీ ఈ విషయంలో మాత్రం రామ్‌చరణ్ కాస్త మెరుగ్గా ఆలోచించాడు. ఇటు ఆర్ఆర్ఆర్ చేస్తూనే ‘ఆచార్య’ ఓ కీ రోల్ చేశారు. ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది.