VK Naresh Malli Pelli: వీకే నరేశ్( Naresh VK,), పవిత్రా లోకేష్(Pavitra Lokesh) ల వెండితెర వివాహానికి ముహూర్తం ఖరారైపోయింది. సిల్వర్‌స్క్రీన్‌పై వీకే నరేశ్, పవిత్రాలోకేష్ల పెళ్లి మే 26న జరగనుంది. వీకే నరేశ్, పవిత్రాలోకేష్, వనితా విజయ్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’(Malli Pelli). ఎమ్ఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వీకే నరేశ్నిర్మించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. మే 26న విడుదల చేస్తున్నట్లుగా చిత్రంయూనిట్ ప్రకటించింది. జయసుధ, శరత్‌బాబు, అనన్యానాగేళ్ల, రోషన్, రవిశర్మ, అన్నపూర్ణమ్మ ఈసినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కన్నడలో ‘మత్తే మధవే’ పేరుతో విడుదల అవుతుంది. కాగా నరేశ్ జీవితంలోని వాస్తవ సంఘటనల ఆధారంగా ‘మళ్లీ పెళ్లి’ చిత్రం తెరకెక్కిన్నట్లుగా తెలుస్తుంది.