Vijay TheGretestof all time తమిళ స్టార్ హీరో విజయ్ మరో హాలీవుడ్ రీమేక్‌కు సైన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. విజయ్ గత చిత్రం ‘లియో’ గత ఏ డాది విడుదలైన సంగతి తెలిసిందే. ‘మాస్టర్’ చిత్రం తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్, హీరో విజయ్ కాంబినేషన్లో వచ్చిన ఫిల్మ్ ఇది. హాలీవుడ్ ఫిల్మ్ ‘హిస్టరీ ఆఫ్ వయలెన్స్’ ఆధారంగా ఈ సినిమాను తీశారు. కాగా ప్రస్తుతం విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమా చేస్తున్నారు. వెంకట్ ప్రభు ఈ సినిమాకు (Vijay TheGretestof all time) దర్శకుడు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థఈ సినిమాను నిర్మిస్తుంది.
అయితే ఈ సినిమా హాలీవుడ్ ఫిల్మ్ ‘జెమినిమేన్’కు తమిళ రీమేక్ అనే టాక్ తెరపైకి వచ్చింది. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రశాంత్, యోగిబాబు, లైలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం విడుదల కానుంది. మరి..ఈ హాలీవుడ్ ఫిల్మ్తోనైనా విజయ్ ఓ సూపర్‌హిట్ అందుకుంటాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ సంగతి ఇలా ఉంచితే… విజయ్ తర్వాతి సినిమా కూడా ఫైనలైజ్ అయ్యిందని, ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తారనే టాక్ వినిపిస్తోంది.