విజయ్ దేవరకొండ
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ చేస్తోన్న తొలి ప్యాన్‌ఇండియన్ ఫిల్మ్ ‘లైగర్’. మిగతా ప్యాన్ ఇండియన్ సినిమాల్లా కాకుండా.. ఈ సినిమాను హిందీలో కూడా రూపొందిస్తున్నారు. సో..లైగర్ సినిమా హిందీలో విజయ్‌దేవరకొండకు తొలి అడుగు. ఇప్పటికే హిందీలో రెండు సిని మాలు తీసిన పూరీజగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘లైగర్’ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల చేయాలనుకుంటున్నారు.
నాగచైతన్య
ఆమిర్‌ఖాన్ లేటెస్ట్ ఫిల్మ్ ‘లాల్ సింగ్ చద్దా’. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగచైతన్య ఓ కీ రోల్ చేశారు. హిందీలో నాగచైతన్య చేసిన ఫస్ట్ స్ట్రయిట్ ఫిల్మ్ ఇదే. ఇందులో కరీనా కపూర్ హీరోయిన్‌గా నటించారు. హాలీవుడ్ ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేక్‌గా లాల్‌సింగ్ చద్దా రూపొందింది. ఈ చిత్రం ఏప్రిల్ 14న హిందీతో పాటు దక్షిణాది భాషల్లో కూడా విడుదల కానుంది.
సత్యదేవ్
అక్షయ్‌కుమార్ నటిస్తున్న ఎన్నో సినిమాల్లో ‘రామ్‌సేతు’ ఒకటి. అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్యదేవ్ ఓ కీ రోల్ చేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ ఏడాది దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా కంటే ముందు సత్యదేవ్ ఓ అఘ్గనిస్తాన్ సినిమా చేశారు. అప్పట్లో దీన్ని హిందీలో కూడా రిలీజ్ చేయాలనుకున్న కుదర్లేదు. ఈ సినిమా విడుదల పై క్లారిటీ లేదు కాబట్టి టెక్నికల్‌గా ‘రామ్‌సేతు’యే సత్యదేవ్‌కు తొలి బాలీవుడ్ సినిమా.
బెల్లంకొడ సాయిశ్రీనివాస్
టాలీవుడ్‌లో యాక్టర్‌గా చెప్పకోదగ్గ సినిమాలు చేసిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హిందీలోహీరోగా పరచయం అవుతు న్నారు. తెలుగులో ప్రభాస్ హీరోగా చేసిన ‘చత్రపతి’ హిందీ రీమేక్‌తో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ బీటౌన్‌లో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేస్తున్నారు. ఈ సినిమా టాకీ పార్టు పూర్తయింది. ఇప్పటికే బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’ వంటి సినిమాలను తీసిన వీవీ వినాయక్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రంపై త్వరలో ఓ క్లారిటీ రానుంది.
అడివి శేష్
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ‘మేజర్’ చిత్రంతో హిందీకి పరిచయం అవుతున్నారు. ‘గూఢచారి’ తర్వాత
అడివి శేష్‌తో దర్శకుడు శశికిరణ్ తిక్క చేసిన చిత్రం ఇది. ఈ సినిమాకు మహేశ్‌బాబు ఓ నిర్మాత. అమర వీరుడు మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తీశారు. హిందీ, తెలుగు భాషల్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మలయాళంతో పాటు ఇతరభాషల్లో కూడా విడుదల కానుంది. అయితే ‘మేజర్’ చిత్రం బాలీవుడ్‌లో విడుదల కాకముందే అడవి శేష్‌కు బాలీవుడ్‌లో సినిమాలు చేసే చాన్సెస్ వస్తున్నాయని తెలిసింది.