Sonamkapoor: బాలీవుడ్ హీరోయిన్ సోనమ్‌కపూర్ ఓ శుభవార్త చెప్పారు. తాను తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు సోనమ్ కపూర్. ఇక 2018 మే 8న ఢిల్లీకి చెందిన వ్యా పార వేత్త అనంద్ ఆహుజాతో సోనమ్‌కపూర్ వివాహం జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది.తాజాగా తాను తల్లి కాబోతున్న విషయం గురించి సోనమ్ చెబుతూ – ‘‘మా (ఆనంద్, సోన మ్) నాలుగు చేతులతో నీ జీవితాన్ని మాకు సాధ్యమైనంత అందంగా తీర్చిదిద్దుతాము. నీగుండె చప్పుళ్లలకు మా హృదయధ్వనులు కూడా తోడవుతాయి. మా జీవితాల్లో నీ రాక కోసంమేం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని తనభర్త్ ఆనంద్‌తో బేబీబంప్ కనిపిస్తున్నతన ఫోటోలను షేర్ చేశారు సోనమ్ కపూర్. ఈ శుభవార్తను సోనమ్ షేర్ చేయగానే నెట్టింట్లోసోనమ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
readmore:Maheshbabu Sarkaru Vaari Paata: స్పెషల్..పెన్నీ!



