ఆర్ఆర్ఆర్ : 2022-03-25
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన భారీ బడ్జెట్ ఫ్యాన్ ఇండియన్ ఫిల్మ్ ‘రౌద్రం..రణం..రుధిరం’ (ఆర్ఆర్ఆర్). ఈ సినిమా కొత్త విడుదల తేదీ ఖరారైంది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. స్వాంతంత్య్ర సమరయోధులు కొమురం భీం, అల్లూరి సీతారామరాజు ఒకవేళ కలుకుని, వారి మధ్య స్నేహాం చిగురించి ఉన్నట్టయితే వీరు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఎలా పోరాడి ఉండేవారు అనే కల్పిత అంశాల ఆధారంగా ‘ఆర్ఆర్ఆర్’ రూపొందింది. ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్, రామ్‌చరణ్ సరసన ఆలియాభట్ కనిపిస్తారు.
ఆచార్య : 2022-04-29
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆచార్య’ సినిమా ఏప్రిల్ 1 నుంచి ఫైనల్‌గా ఏప్రిల్ 29కి మారింది. రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్, పూజాహెగ్డే లీడ్ రోల్స్ చేయగా, సోనూసూద్ ఓ విలన్ పాత్ర చేశాడు. దేవా దయశాఖలో జరిగే అక్రమాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ధర్మస్థలి అనే కల్పిత గ్రామం నుంచి ఆచా ర్యగా చిరంజీవి, సిద్ధగా రామ్‌చరణ్ విలన్స్‌పై ఎలా పోరాడారు అనేది కథ.
భీమ్లానాయక్ : 2022-02-25, 2022-04-01
పవన్‌కల్యాణ్, రానా హీరోలుగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘భీమ్లానాయక్’. సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మలయాళ హిట్ అప్పయ్యనుమ్ కోషియుమ్‌కు తెలుగు రీమేక్‌గా రానున్న ‘భీమ్లానాయక్’ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఓ సబ్ ఇన్స్పెక్టర్, ఆర్మీకి చెందిన ఓ హావల్దారీల మధ్య ఉండే ఈగో క్లాషెస్ వారి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేశాయి? అన్న అంశాల ఆధారంగా భీమ్లానాయక్ ఉంటుంది. సస్పెండెడ్ సబ్ఇన్స్పెక్టర్గా పవన్ కల్యాణ్, హవల్దారీ పాత్రలో రానా కనిపిస్తారు.
ఎఫ్ 3 : 2022-04-28
వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహారీన్ హీరో హీరోయిన్లుగా సునీల్, సోనాలీ చౌహాన్, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఎఫ్ 3’. ‘దిల్’రాజు, శీరిష్ నిర్మిస్తున్నారు. ‘ఎఫ్ 2’ కు కొనసాగింపుగా ఈ చిత్రం వస్తోంది. అయితే కాన్సెప్ట్ వేరు. డబ్బు కోసం తాపత్రయపడే భార్యల బ్యాక్ డ్రాప్లో ఎఫ్ 3 ఉంటుంది. ఇందులో వెంకీకి రేచీకటి, వరుణ్‌కు నత్తి ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నారు.
సర్కారువారి పాట : 2022-05-12
మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘సర్కారువారిపాట’. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో షూటింగ్ ప్రజెంట్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఫిబ్రవరి మొదటివారంలో మహేశ్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతారు. కీర్తీ సురేశ్ కథానాయిక. బ్యాంకు దోపీడీ, తెలివిగా బ్యాంకులను మోసం చేసి ఐపీ పెట్టే బడా వీఐపీల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలిసింది. ఓ వీఐపీ చేసిన మోసానికి బలైన ఓ బ్యాంకు ఎంప్లాయి కొడుకు పాత్రలో మహేశ్ కనిపిస్తారట.