‘రౌద్రం…రణం..రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్) సినిమా కొత్త విడుదల తేదీ వెల్లడైంది. మార్చి 25న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల కానుంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను మార్చి 18 లేదా ఏప్రిల్ 28న విడుదల చేస్తామని ఇటీవల చిత్రబృందం చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మార్చి 25న ‘ఆర్‌ఆర్‌ఆర్’ రిలీజ్ అంటూ అధికారిక ప్రకటనరావడం చర్చనీయాంశమైంది. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ రిలీజ్ డేట్ మార్చిలో కన్ఫార్మ్ కావడంతో ఏప్రిల్‌లో రిలీజ్
కానున్న పెద్ద సినిమాలకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజ మౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాను దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించారు. ఇందులో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ కనిపిస్తారు. అజయ్‌దేవగన్, శ్రియ, రే స్టీవెన్‌సన్, అలీసన్ డూడీ, రాహుల్‌రామ కృష్ణ, సముద్రఖని కీలక పాత్రలు చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. ఈ సంగతి ఇలా ఉంచితే..ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్ సినిమా 2020 జూలై 30, 2021 జనవరి 8, 2021 అక్టోబరు 13, 2022 జనవరి 7 తేదీలను ప్రకటించి (ఇటీవల 2022 మార్చి 18, ఏప్రిల్ 28 తేదీలను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే) ఇప్పుడు మార్చి 25కి ఫైనల్ అయ్యింది.
ఆర్‌ఆర్‌ఆర్ ఫైనల్ రిలీజ్ డేట్ ఫిక్స్..ఏప్రిల్‌లో రిలీజ్ కానున్న సినిమాలకు పండగ


Leave a comment
Leave a comment