Raviteja Eagle: ఇండస్ట్రీలో సెంటిమెంట్స్‌ను ఫాలో అవుతుంటారు. అవి కొంతమందికి కలిసొచ్చాయి కూడా. కానీ ఇప్పుడు రవితేజ (Raviteja) తీసుకున్న ఓ సాహసోపేతమైన నిర్ణయం ఆయన ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తోంది.
రవితేజ లేటెస్ట్ స్టైలిస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ (Eagle). సంక్రాంతికి ఈ సినిమాను విడుదలను ప్రకటించారు. కానీ రిలీజ్ సమీకరణాలు, తెలుగు ఫిల్మ్ చాంబర్ విజ్ఞప్తిల మేరకు ‘ఈగల్’ సినిమా రిలీజ్‌ను ఫిబ్రవరి 9కి వాయి దా వేశారు. కానీ ఇక్కడ చర్చనీయాంశమైన విషయం ఏంటంటే…ఫిబ్రవరిలో విడుదలైన రవితేజ సినిమా ఏదీ హిట్ కాలేదు. పైగా డిజాస్టర్స్‌గా నిలిచాయి.
రవితేజ హీరోగా పరిచయం అయిన తొలి చిత్రం ‘షాక్’. 2006లో విడుదలైన ఈ సినిమా రవితేజకు నిజంగానే షాక్ ఇచ్చింది. ఓ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం 2006 ఫిబ్రవరి 9న విడుదలైంది. ఈ ‘షాక్’ తర్వాత మళ్లీ రవితేజ ‘నిప్పు’గా 2012లో థియేటర్స్‌కు వచ్చాయి. ఈ ‘నిప్పు’ సెగ రవితేజకు బాగా తగిలింది. 2012 ఫిబ్రవరి 17న ఈ చిత్రం విడులైన ‘నిప్పు’ రవితేజ కెరీర్లో మరో డిజాస్టర్. సేమ్.. రవితేజ కెరీర్లో ఫిబ్రవరిలో విడుదలైన మరో సినిమా ‘టచ్ చేసి చూడు’. 2018 ఫిబ్రవరి 2న విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్. మరోసారి ఫిబ్రవరి నెలలో రవితేజ అదృష్టాన్ని పరీక్షించుకున్నట్లు ఉన్నారు. అదే..‘ఖిలాడి’. 2022 ఫిబ్రవరి 11న విడుదలైన ‘ఖిలాడి’ చిత్రం రవితేజకు మరో డిజాస్టర్. ఇలా ఫిబ్రవరిలో విడుదలైన రవితేజ సినిమాలు ఏవీ ఆయనకు బాక్సాఫీస్ పరంగా కలిసి రాలేదు. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ సినిమా 2024 ఏప్రిల్ 09న రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఈ తరుణంలో ఈ ఫిబ్ర వరిలోనైనా రవితేజ ఫెయిల్ రికార్డును బద్దలు కొట్టి హిట్ ట్రాక్‌లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ కోరు కుంటున్నారు.
రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ సినిమాలో కావ్యాథాపర్, అనుపమాపరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటించారు. నవదీప్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రధారులు. ‘సూర్య వర్సెస్ సూర్య’ అనే ఓ డిఫరెంట్ మూవీ తీసిన సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ‘ఈగల్’ సినిమాలో రవితేజ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు. అయితే క్యారెక్టర్ దృష్ట్యా రవితేజ ఈ చిత్రంలో స్నైపర్ అని తెలిసింది. ‘థమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.
Tollywood Sequels: టాలీవుడ్‌ని సీక్వెల్ ఆవహించింది!
అలాగే ఇదే బ్యానర్లో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమా చేస్తున్నారు. హిందీ హిట్ ‘రైడ్’కు ఇది తెలుగు రీమేక్. హరీష్‌శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. అలాగే రవితేజ హీరోగా ‘జాతిరత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ డైరెక్షన్లో ఓ మూవీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఉంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని తెలిసింది.
Nagarjuna: నాగార్జున ఆకాంక్షను నిజం చేయనున్న రాజమౌళి?