Ramcharan: 2013 సెప్టెంబరు 6….రామ్‌చరణ్ (Ramcharan) హీరోగా హిందీ, తెలుగు భాషల్లో చేసిన సినిమా ‘జం జీర్’(తెలుగులో ‘తుఫాన్’) ఈ రోజే విడుదలైంది. బాలీవుడ్‌లో చరణ్‌కు ఇది తొలి అడుగు. ఈ సినిమాకు ముందు రామ్ చరణ్ చేసిన ‘రచ్చ’, ‘నాయక్’ చిత్రాలు ఫర్వాలేదనిపించాయి కానీ సూపర్‌హిట్ చిత్రాలైతే కావు. ఇక జంజీర్ విడుదలైన రోజు…బాలీవుడ్ మీడియా రామ్‌చరణ్ యాక్టింగ్‌ను ఏకరువు పెట్టింది. చరణ్‌కు యాక్టింగ్ రాదని, తండ్రి మెగాస్టార్ చిరంజీవి ట్యాగ్‌తో ఇండస్ట్రీలో నెట్టుకొస్తున్నాడని (‘మగధీర’ అంతటి అద్భుత విజయం సాధించినప్పటికీని), ఫేస్‌లో సరిగా ఎక్స్‌ప్రెషన్స్ పలకడం లేదని, హీరోగా హీరోయిన్ ప్రియాంకా చోప్రా ముందు తేలిపోయడాని ఇలా ఏవోవో వార్తలు రాశారు. ఇదే అదునని భావించిన చరణ్ యాంటీ ఫ్యాన్స్ అండ్ మీడియా ప్రతినిథులు చరణ్ యాక్టింగ్‌ను ప్రతిభను గురించి దర్శకుల కంటే ఎక్కువగా విశ్లేషించారు.
ఆ తర్వాత రామ్‌చరణ్ రంగస్థలంలో అద్భుతంగా నటించి హిట్ కొడితే..ఇది దర్శకుడు సుకుమార్ మ్యాజిక్ అని, సినిమా విజయంలో రామలక్ష్మీగా సమంత ఇరగదీశారని..ఈ టైమ్‌లోకూడా చరణ్‌ను కాస్త తక్కువ చేసే ప్రయత్నమే చేశారు సో కాల్డ్ యాంటీ చరణ్ ఫ్యాన్స్. కానీ ఒకప్పుడు చరణ్‌ని దెప్పిపొడిసిన బాలీవుడ్ మీడియా, యాంటీ ఫ్యాన్స్…ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌లో చరణ్ యాక్టింగ్, ఎక్స్‌ప్రెషన్స్ డెలివరీ, డైలాగ్ డెలివరీని చూసి తప్పు పట్టగలరా? చరణ్ ప్రతిభను లోపాలు ఎత్తి చూపగలరా? అలాగే ఇటు బాలీవుడ్ మీడియా ఇప్పుడు రామ్‌చరణ్ యాక్టింగ్ గురించి ఆకాశమంతా పొగు డుతోంది. నిజమే…ఒక నటుడు పదునైన ఆర్టిస్టుగా ఎదగాలంటే కాస్త టైమ్ పడుతుంది. తెలుగు చిత్రపరిశ్రమలో ఇప్పుడున్న స్టార్ హీరోల్లో కొందరు విలన్స్‌గా స్టార్ట్ అయితే మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్టారై్ట ఆ తర్వాత ఇప్పుడు హీరోలుగా చేస్తున్నారు. దేనికైనా కాస్త టైమ్ పడుతుంది.
ఆర్‌ఆర్‌ఆర్(RRR) సినిమాలో ఎన్టీఆర్(NTR) అద్భుతంగా నటించారు. ఎన్టీఆర్‌గారి పాత్రను గురించి మాట్లాడటం లేదు కానీ…
– ఆర్‌ఆర్‌ఆర్ (RRR)లో చరణ్ ఎంట్రీ సీన్‌లో యాక్షనే కాదు..ఎమోషనూ ఉంటుంది. అక్తర్ (ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీ ఆర్‌గా భీమ్ మరో పేరు) మల్లిని తీసుకుని వెళ్లాలనుకుంటాడు..ఇందుకు జెన్నీ (ఒలివియా మోరిస్) తో స్నేహం చేయాలనుకుంటాడు..ఈ స్నేహానికి వారధిగా నిలిచి, అక్తర్ వ్యూహాన్ని ముందుకు నడిపింది
ఎవరు..రామరాజు అంటే రామ్‌చరణ్.
– కుర్రాడిని కాపాడాలని అక్తర్, రామరాజులు ఇద్దరూ అనుకుంటారు కానీ కుర్రాడిని కాపాడే ప్లాన్‌ను చెప్పింది? ఎవరు..రామరాజు. ఇక ఇదే సీన్‌కు ముందు ..అక్తర్ బృందంలోని వ్యక్తి తప్పించుకుపోయి
నప్పుడు హెల్ప్‌లెస్‌గా ఫీలయ్యే చరణ్ ఎక్స్‌ప్రెషన్స్ సూపర్భ్.
– ప్రీ ఇంట్రవెల్‌లో అక్తర్ బృందంలోని ఒకరు చరణ్‌పై పామును విసిరి ఒకగంటలో చనిపోతావన్నప్పుడు
అతని విడిచిపెడతానే కానీ కోపంతో చంపేయడు…తాను ఎలాగో చనిపోతాను కదా అని అతన్నీ బతక
మంటాడు. ఈ సీన్‌లో రామ్‌చరణ్ యాక్టింగ్‌లోనీ మెచ్యూరిటీ, ఎక్స్‌ప్రెషన్స్‌ను ఎవరైనా తప్పుపట్టగలరా?
RRR Review: ఆర్‌ఆర్‌ఆర్ (రౌద్రం..రణం..రుధిరం) రివ్యూ
– స్కాట్ (ఆర్‌ఆర్‌ఆర్ విలన్)ను చంపాలనుకునే వ్యక్తి తన స్నేహితుడు అక్తరే అని తెలిసినప్పటికీని బ్రిటీష్‌వారికి చెప్పకుండా..(వేరే వారు అయితే అతన్నీ చంపే చాన్స్‌లు ఉండొచ్చు) తానే వచ్చీ ఆరెస్ట్ చేయాలనుకుంటాడు తప్ప స్వార్థం కోసం బ్రిటిష్‌వారిని అక్తర్‌పై ఊసిగొల్పడు.
– ఇక సెకండాఫ్‌లో అక్తర్‌ను స్కాట్ దొర అక్తర్‌ను బహిరంగంగా క్షమాపణలు చెప్పించాలని, అక్తర్‌ను ఉసిగొల్పినప్పుడు.. అక్తర్ బాధపడకూదని రామరాజు గొలుసుకు కాలితో లాగడం, మళ్లు కొరడాను
ముందుగా అక్కడనున్న చెక్క పిల్లర్‌పై కొట్టడం, తనకు ఇష్టం లేకపోయిన భీమ్‌ను కొట్టడం వంటి సీన్స్‌లో
చరణ్ ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతంగా లేవు అని చెప్పలేం.
– అనుకుంటే తనకున్న పవర్స్‌తో అక్తర్‌ను రామరాజు ఉరి తీయవచ్చు. కానీ అతని గురించి, స్నేహాం గురించి ఆలోచించి నిస్వార్థంగా తనను తాను రిస్క్‌లో పెట్టుకుంటాడు. ఇక క్లైమాక్స్ సీన్స్‌లో 70 శాతం
చరణే కనిపిస్తాడు అన్న విషయం ఆర్‌ఆర్‌ఆర్ చూసిన ఎవరికైనా అర్థం అవుతుంది.
– రామరాజు పాత్రలో మూడు షేడ్స్ ఉన్నాయి. వీటి కోసం రామ్‌చరణ్ మూడుసార్లు డైట్, కసరత్తులు చేశారు. రామరాజుగా చరణ్ కష్టం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
అందుకే ఇప్పుడు రామ్‌చరణ్ వెండితెరపై మీసం మేలేశాడు. ఫ్యాన్స్ కూడా!
(పైవన్నీ చరణ్‌లోని యాక్టింగ్ ప్రతిభను చెప్పడానికే కానీ ఎన్టీఆర్‌గారి పాత్ర తక్కువ చేయాలనుకోవడం లేదు)