Contents
Radheshyam Review ప్రభాస్ కెరీర్లో ఛత్రపతి, మిర్చి, బాహుబలి, సాహో వంటి యాక్షన్ చిత్రాలు ఉన్నట్లే మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ వంటి రొమాంటిక్ హిట్స్ కూడా ఉన్నాయి. అయితే మిర్చి, బాహుబలి, సాహో చిత్రాల తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ప్రభాస్ చేసిన లేటెస్ట్ రొమాంటిక్ ‘రాధేశ్యామ్’ (Radheshyam). ఈ చిత్రం మార్చి 11న రిలీజైంది. అలాగే ప్రభాస్హీరోగా వెండితెరపై కనిపించి దాదాపు రెండున్నర సంవత్సరాలు అవుతోంది. మరి..రాధేశ్యామ్ ప్రభాస్ అభిమానుల అంచనాలను అందుకుందా? ప్రేమకు, విధికి మధ్య జరిగే సంఘర్షణలో గెలుపు ఎవరిది?తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం ‘రాధేశ్యామ్’ (Radheshyam)ప్రేమికులు ఏం చేశారు? Radheshyam Reviewకథప్రముఖ జ్యోతిష్కుడు విక్రమాదిత్య(ప్రభాస్) తన జీవితంలో లవ్‌లైన్ లేదనీ ప్రేమించడాన్ని ఇష్టపడడు. కానీ ఫ్లర్టేషన్షిఫ్( ప్రేమికులలాగా అన్నీ పనులు చేసుకుని, పెళ్లి చేసుకోకపోవడం)ను మాత్రం మెయిన్‌టెయిన్ చేస్తుంటాడు. అలా ఓ సంచారిలా దేశాలు తిరుగుతుంటారు. ఈ క్రమంలో రోమ్‌లో డాక్టరు ప్రేరణ (పూజా హెగ్డే)ని చూసి ఇష్టపడతాడు. ప్రేరణ ను కూడా తనతో ఫ్లర్టేషన్షిఫ్ చేయమని కోరతాడు. ఇందుకు ప్రేరణ నిరాకరిస్తుంది. కానీ ప్రేరణను విక్రమాదిత్య ఫాలో అవుతుంటాడు. ఈ క్రమంలో విక్రమాదిత్యతో ప్రేమలోపడుతుంది ప్రేరణ. కానీ ఇదే సమయంలో ప్రేరణ చికిత్స లేని ఓ వ్యధితో బాధపడుతుందని, మరో రెండునెలల్లో చనిపోతుందని తెలుస్తుంది. కానీ వృత్తి రిత్యా ప్రముఖ జ్యోతిష్కుడైన విక్రమాదిత్య మాత్రం ప్రేరణనిండునూరేళ్లు బతుకుతుందని, సంతోషంగా జీవిస్తుందని, తన చేతిలో లైఫ్‌లైన్ కనిపిస్తోందని చెబుతాడు.అయితే విక్రమాదిత్యకు తాను భవిష్యత్‌లో ఓ సందర్భంలో చనిపోతానని తన చేతిరాతలను చూసి గ్రహిస్తాడు.మరి.. విక్రమాదిత్య జ్యోతిష్యం చెప్పినట్లు ప్రేరణ బతుకుందా? విధిని చావును ఎదిరింది విక్రమాదిత్య జీవిస్తాడా? విక్రమాదిత్య, ప్రేరణల ప్రేమకు శుభం కార్డు పడుతుందా? అనేదే కథ.విశ్లేషణకథ మొత్తం 1976 యూరప్ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుంది. జ్యోతిష్కంకు, సైన్స్‌కు ఉన్న తేడాలను చెప్పే పరమ హంస (సినిమాలో కృష్ణంరాజు చేసే పాత్ర)తో కథ మొదలవుతుంది. ఆ తర్వాత విక్రమాదిత్య క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, ప్రేరణ పాత్ర పరిచయం ఇలాంటి సన్నివేశాలతో దాదాపు 20 నిమిషాలు కాస్త బాగానే సాగుతుంది. కానీ ఎప్పుడైతే విక్రమాదిత్య, ప్రేరణల మధ్య ఫ్లర్టేషన్‌షిప్ స్టార్ట్ అవుతుందో? అప్పట్నుంచి కథ కాస్తనెమ్మ దిస్తుంది. ప్రేరణ పనిచేసే హాస్పిటల్, ప్రభాస్ ఇంటి చూట్టే కథ అంతా తిరుగుతూ ఉంటుంది. ఈ సమ యంలో ప్రేక్షకులు కాస్త సహనంతో ఉండక తప్పని పరిస్థితి. ఇక ఇంట్రవెల్‌కు ముందు కాస్త వేగం పుంజుకుంటుంది. ప్రేరణ వ్యాధితో హాస్పిటల్లో జయిన్ కావడం, ప్రేరణ చనిపోతుందని డాక్టర్లు చెబుతున్నప్పటికీనివిక్రమాదిత్య మాత్రం ప్రేరణ బతుకుతుందని మొండిగా వాధించే సన్నివేశాలతో రాధేశ్యామ్ ఇంట్రవెల్ పడు తుంది. ఇక సెకండాఫ్‌లో బతుకుతానన్న హోప్‌తో విక్రమాదిత్యను ప్రేరణను కలుస్తుంది. ఈ సన్నివేశాలు కాస్తఆహ్లాదరకరంగానే ఉంటాయి. ఇక ప్రేరణ పెదనాన్న డాక్టరు చక్రవర్తి (సచిన్ ఖేడ్కర్) విక్రమాదిత్యను టెస్ట్ చేసేసన్నివేశం, జగపతిబాబుతో ప్రభాస్ పలికే సంభాషణలు విక్రమాదిత్య పాత్రలోని మాస్‌ను బయటపెడతాయి.విజువల్‌గా ‘రాధేశ్యామ్’ చిత్రం బాగుంది. ‘మన భవిష్యత్తు చేతి రాతల్లో లేదు..మన చేతల్లో ఉంది’ అనే విషయానికి ఓ ప్రేమకథ ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ కథ పరంగా ఇంకాస్త లోతుగాదర్శకుడు వెళ్లి ఉంటే బాగుండేది. అప్పటివరకు జోతిష్యం ఎంతో గొప్పదన్నట్లుగా చెప్పి, జ్యోతిష్కుడిగా విక్రమాదిత్య మాటలను నిజం చేసిన దర్శకుడు..విక్రమాదిత్య నమ్మిన దాన్ని మాత్రం నిజంగా చూపించలేకపోయాడు. అలాగే క్లైమాక్స్‌లో వచ్చే షిప్ సన్నివేశాలు విజువల్‌గా బాగున్నాయి. కానీ హీరో అంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత కూడా బతికిరావడం అనేది తెలుగు సినిమాల్లోనే జరుగుతుంది. మరోవైపు తాను చనిపోతే విక్రమాదిత్య బతుకుతాడని ప్రేరణ ఓ లాజిక్‌తో ఆత్మహాత్యకు పూనుకుంది? అన్న విషయం ఓ ప్రశ్నార్థకం. ఫైట్స్, మాస్‌సాంగ్స్ కోరుకునే అభిమానులకు మాత్రం రాధేశ్యామ్ నచ్చదు. అలాగే బలమైన నటీనటులు ఉన్నప్పటికీని వారి క్యారెక్టర్స్‌ను దర్శకుడు సరైన విధానంలో వినియోగించుకోలేమో! అనిపిస్తుంది.ఎవరు ఎలా చేశారంటే..!కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్‌ను యాక్షన్ హీరోగా చూసుకున్న అభిమానులకు ‘రాధేశ్యామ్’ కాస్త డిఫరెంట్ ఫీల్‌ను ఇస్తుంది. జ్యోతిష్కుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ బాగానే చేశారు. కానీ ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గసన్నివేశాలు మాత్రం మరికొన్ని ఉండాల్సింది. ప్రేరణ పాత్రలో పూజాహెగ్డే మెప్పించారు. ముఖ్యంగా విక్రమాదిత్యను ప్రేరణ ప్రేమించే సన్నివేశాలు బాగుంటాయి. అలాగే ఉన్న పరిధిలో గ్లామర్‌గా, ఎమోషనల్‌గా పూజాహెగ్డేచేశారు. ఇక విక్రమాదిత్యకు గురువు పరమహంసగా కనిపించిన కృష్ణంరాజు బాగా చేశారు. సినిమాలో పాత్రకొంచెం సేపే ఉన్నప్పటికీని ఈ పాత్ర ప్రభావం సినిమాపై చూపిస్తుంది. అలాగే డాక్టరు చక్రవర్తి పాత్రలోసచిన్ ఖేడ్కర్‌కి కూడా కీలక పాత్రే. విక్రమాదిత్యను టెస్ట్ చేయడం, అతని ప్రతిభను తెలుసుకుని ప్రేరణలో బతుకు పట్ల ఆశకల్పించడం వంటి సన్నివేశాల్లో సచిన్ ఖేడ్కర్ నటన బాగుంటుంది. ఇక ప్రభాస్ తల్లిపాత్రలో భాగ్య శ్రీ, ప్రేరణ గ్యాంగ్‌లో ప్రియదర్శి, షిప్ కెప్టెన్‌గా జయరామ్ వంటివారు తమ పరిధి మేరకు చేశారు. రొమాంటిక్ ఫిల్మ్ కావడంతో తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రత్యేకత పెద్దగా ఏం కనిపించలేదు. కానీ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం ఫర్లేదనిపిస్తుంది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ వేసిన ‘డెస్టినో హాస్పిటల్’, క్లైమాక్స్ షిప్ ఎపిపోడ్ విజువల్స్ పరంగా కెమెరామ్యాన్ మనోజ్ పనితనం, నిర్మాణ విలువలు కనిపిస్తాయి.బలాలుప్రభాస్, పూజాహెగ్డేల కెమిష్ట్రీవిజువల్స్బలహీనతలుఫస్టాఫ్లో మొదటి 15 నిమిషాలు తప్ప ప్రీ ఇంట్రవెల్ వరకు స్లోగా సాగడంఫ్లర్టేషన్షిప్ లవ్ రిలేషన్‌షిప్‌గా మారడానికి బలమైన కారణాలను చూపలేకపోవడంప్రభాస్ స్టైల్ ఆఫ్ మాసిజం లోపించడం
చిత్రం :రాధేశ్యామ్
ప్రధాన తారాగణం: ప్రభాస్, పూజాహెగ్డే, కృష్ణంరాజు, సచిన్ ఖేడ్కర్.
కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: కె. రాధ కృష్ణకుమార్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ (తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం),
మిధున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ)
నేపథ్య సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస
ఆర్ట్‌డైరెక్టర్: రవీందర్
సౌండ్ ఇంజినీర్: రసూల్ పూకుట్టి
బ్యానర్స్: యూవీక్రియేషన్స్, గోపీకృష్ణామూవీస్, టిసిరీస్(హిందీలో విడుదల)
నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీద
బడ్జెట్: దాదాపు 300 కోట్లు
Radheshyam Review ప్రభాస్ కెరీర్లో ఛత్రపతి, మిర్చి, బాహుబలి, సాహో వంటి యాక్షన్ చిత్రాలు ఉన్నట్లే మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ వంటి రొమాంటిక్ హిట్స్ కూడా ఉన్నాయి. అయితే మిర్చి, బాహుబలి, సాహో చిత్రాల తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ప్రభాస్ చేసిన లేటెస్ట్ రొమాంటిక్ ‘రాధేశ్యామ్’ (Radheshyam). ఈ చిత్రం మార్చి 11న రిలీజైంది. అలాగే ప్రభాస్హీరోగా వెండితెరపై కనిపించి దాదాపు రెండున్నర సంవత్సరాలు అవుతోంది. మరి..రాధేశ్యామ్ ప్రభాస్ అభిమానుల అంచనాలను అందుకుందా? ప్రేమకు, విధికి మధ్య జరిగే సంఘర్షణలో గెలుపు ఎవరిది?తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం ‘రాధేశ్యామ్’ (Radheshyam)ప్రేమికులు ఏం చేశారు? Radheshyam Review
కథప్రముఖ జ్యోతిష్కుడు విక్రమాదిత్య(ప్రభాస్) తన జీవితంలో లవ్‌లైన్ లేదనీ ప్రేమించడాన్ని ఇష్టపడడు. కానీ ఫ్లర్టేషన్షిఫ్( ప్రేమికులలాగా అన్నీ పనులు చేసుకుని, పెళ్లి చేసుకోకపోవడం)ను మాత్రం మెయిన్‌టెయిన్ చేస్తుంటాడు. అలా ఓ సంచారిలా దేశాలు తిరుగుతుంటారు. ఈ క్రమంలో రోమ్‌లో డాక్టరు ప్రేరణ (పూజా హెగ్డే)ని చూసి ఇష్టపడతాడు. ప్రేరణ ను కూడా తనతో ఫ్లర్టేషన్షిఫ్ చేయమని కోరతాడు. ఇందుకు ప్రేరణ నిరాకరిస్తుంది. కానీ ప్రేరణను విక్రమాదిత్య ఫాలో అవుతుంటాడు. ఈ క్రమంలో విక్రమాదిత్యతో ప్రేమలోపడుతుంది ప్రేరణ. కానీ ఇదే సమయంలో ప్రేరణ చికిత్స లేని ఓ వ్యధితో బాధపడుతుందని, మరో రెండునెలల్లో చనిపోతుందని తెలుస్తుంది. కానీ వృత్తి రిత్యా ప్రముఖ జ్యోతిష్కుడైన విక్రమాదిత్య మాత్రం ప్రేరణనిండునూరేళ్లు బతుకుతుందని, సంతోషంగా జీవిస్తుందని, తన చేతిలో లైఫ్‌లైన్ కనిపిస్తోందని చెబుతాడు.అయితే విక్రమాదిత్యకు తాను భవిష్యత్‌లో ఓ సందర్భంలో చనిపోతానని తన చేతిరాతలను చూసి గ్రహిస్తాడు.మరి.. విక్రమాదిత్య జ్యోతిష్యం చెప్పినట్లు ప్రేరణ బతుకుందా? విధిని చావును ఎదిరింది విక్రమాదిత్య జీవిస్తాడా? విక్రమాదిత్య, ప్రేరణల ప్రేమకు శుభం కార్డు పడుతుందా? అనేదే కథ.
విశ్లేషణకథ మొత్తం 1976 యూరప్ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుంది. జ్యోతిష్కంకు, సైన్స్‌కు ఉన్న తేడాలను చెప్పే పరమ హంస (సినిమాలో కృష్ణంరాజు చేసే పాత్ర)తో కథ మొదలవుతుంది. ఆ తర్వాత విక్రమాదిత్య క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, ప్రేరణ పాత్ర పరిచయం ఇలాంటి సన్నివేశాలతో దాదాపు 20 నిమిషాలు కాస్త బాగానే సాగుతుంది. కానీ ఎప్పుడైతే విక్రమాదిత్య, ప్రేరణల మధ్య ఫ్లర్టేషన్‌షిప్ స్టార్ట్ అవుతుందో? అప్పట్నుంచి కథ కాస్తనెమ్మ దిస్తుంది. ప్రేరణ పనిచేసే హాస్పిటల్, ప్రభాస్ ఇంటి చూట్టే కథ అంతా తిరుగుతూ ఉంటుంది. ఈ సమ యంలో ప్రేక్షకులు కాస్త సహనంతో ఉండక తప్పని పరిస్థితి. ఇక ఇంట్రవెల్‌కు ముందు కాస్త వేగం పుంజుకుంటుంది. ప్రేరణ వ్యాధితో హాస్పిటల్లో జయిన్ కావడం, ప్రేరణ చనిపోతుందని డాక్టర్లు చెబుతున్నప్పటికీనివిక్రమాదిత్య మాత్రం ప్రేరణ బతుకుతుందని మొండిగా వాధించే సన్నివేశాలతో రాధేశ్యామ్ ఇంట్రవెల్ పడు తుంది. ఇక సెకండాఫ్‌లో బతుకుతానన్న హోప్‌తో విక్రమాదిత్యను ప్రేరణను కలుస్తుంది. ఈ సన్నివేశాలు కాస్తఆహ్లాదరకరంగానే ఉంటాయి. ఇక ప్రేరణ పెదనాన్న డాక్టరు చక్రవర్తి (సచిన్ ఖేడ్కర్) విక్రమాదిత్యను టెస్ట్ చేసేసన్నివేశం, జగపతిబాబుతో ప్రభాస్ పలికే సంభాషణలు విక్రమాదిత్య పాత్రలోని మాస్‌ను బయటపెడతాయి.విజువల్‌గా ‘రాధేశ్యామ్’ చిత్రం బాగుంది. ‘మన భవిష్యత్తు చేతి రాతల్లో లేదు..మన చేతల్లో ఉంది’ అనే విషయానికి ఓ ప్రేమకథ ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ కథ పరంగా ఇంకాస్త లోతుగాదర్శకుడు వెళ్లి ఉంటే బాగుండేది. అప్పటివరకు జోతిష్యం ఎంతో గొప్పదన్నట్లుగా చెప్పి, జ్యోతిష్కుడిగా విక్రమాదిత్య మాటలను నిజం చేసిన దర్శకుడు..విక్రమాదిత్య నమ్మిన దాన్ని మాత్రం నిజంగా చూపించలేకపోయాడు. అలాగే క్లైమాక్స్‌లో వచ్చే షిప్ సన్నివేశాలు విజువల్‌గా బాగున్నాయి. కానీ హీరో అంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత కూడా బతికిరావడం అనేది తెలుగు సినిమాల్లోనే జరుగుతుంది. మరోవైపు తాను చనిపోతే విక్రమాదిత్య బతుకుతాడని ప్రేరణ ఓ లాజిక్‌తో ఆత్మహాత్యకు పూనుకుంది? అన్న విషయం ఓ ప్రశ్నార్థకం. ఫైట్స్, మాస్‌సాంగ్స్ కోరుకునే అభిమానులకు మాత్రం రాధేశ్యామ్ నచ్చదు. అలాగే బలమైన నటీనటులు ఉన్నప్పటికీని వారి క్యారెక్టర్స్‌ను దర్శకుడు సరైన విధానంలో వినియోగించుకోలేమో! అనిపిస్తుంది.
ఎవరు ఎలా చేశారంటే..!కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్‌ను యాక్షన్ హీరోగా చూసుకున్న అభిమానులకు ‘రాధేశ్యామ్’ కాస్త డిఫరెంట్ ఫీల్‌ను ఇస్తుంది. జ్యోతిష్కుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ బాగానే చేశారు. కానీ ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గసన్నివేశాలు మాత్రం మరికొన్ని ఉండాల్సింది. ప్రేరణ పాత్రలో పూజాహెగ్డే మెప్పించారు. ముఖ్యంగా విక్రమాదిత్యను ప్రేరణ ప్రేమించే సన్నివేశాలు బాగుంటాయి. అలాగే ఉన్న పరిధిలో గ్లామర్‌గా, ఎమోషనల్‌గా పూజాహెగ్డేచేశారు. ఇక విక్రమాదిత్యకు గురువు పరమహంసగా కనిపించిన కృష్ణంరాజు బాగా చేశారు. సినిమాలో పాత్రకొంచెం సేపే ఉన్నప్పటికీని ఈ పాత్ర ప్రభావం సినిమాపై చూపిస్తుంది. అలాగే డాక్టరు చక్రవర్తి పాత్రలోసచిన్ ఖేడ్కర్‌కి కూడా కీలక పాత్రే. విక్రమాదిత్యను టెస్ట్ చేయడం, అతని ప్రతిభను తెలుసుకుని ప్రేరణలో బతుకు పట్ల ఆశకల్పించడం వంటి సన్నివేశాల్లో సచిన్ ఖేడ్కర్ నటన బాగుంటుంది. ఇక ప్రభాస్ తల్లిపాత్రలో భాగ్య శ్రీ, ప్రేరణ గ్యాంగ్‌లో ప్రియదర్శి, షిప్ కెప్టెన్‌గా జయరామ్ వంటివారు తమ పరిధి మేరకు చేశారు. రొమాంటిక్ ఫిల్మ్ కావడంతో తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రత్యేకత పెద్దగా ఏం కనిపించలేదు. కానీ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం ఫర్లేదనిపిస్తుంది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ వేసిన ‘డెస్టినో హాస్పిటల్’, క్లైమాక్స్ షిప్ ఎపిపోడ్ విజువల్స్ పరంగా కెమెరామ్యాన్ మనోజ్ పనితనం, నిర్మాణ విలువలు కనిపిస్తాయి.
బలాలుప్రభాస్, పూజాహెగ్డేల కెమిష్ట్రీవిజువల్స్
బలహీనతలుఫస్టాఫ్లో మొదటి 15 నిమిషాలు తప్ప ప్రీ ఇంట్రవెల్ వరకు స్లోగా సాగడంఫ్లర్టేషన్షిప్ లవ్ రిలేషన్‌షిప్‌గా మారడానికి బలమైన కారణాలను చూపలేకపోవడంప్రభాస్ స్టైల్ ఆఫ్ మాసిజం లోపించడం
ఫైనల్: ‘రాధేశ్యామ్’ చేతిలో హిట్ లైన్ లేదు! (2.25/ 5)