హీరోయిన్ ప్రియమణి చేస్తోన్న లేటెస్ట్ వెబ్ ఒరిజినల్ భామా కలాపం’ ట్రైలర్ ను విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఈ వెబ్ ఒరిజినల్ ఫిబ్రవరి 11న ‘ఆహా’లో ప్రసారమవుతుంది. ‘డియర్ కామ్రేడ్’ డైరెక్టర్ భరత్ కమ్మ షో రన్నర్. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన భామాకలాపం
ట్రైలర్ లాంచ్‌లో అతిథిగా పాల్గొన్న విజయ్ దేవరకొండ మాట్లాడుతూ- ` ప్రియమణిగారి ఏ లాంగ్వేజ్‌లో అయిన కరెక్ట్‌గా సరిపోతారు. భామా కలాపం ఒరిజినల్ అందరికీ నచ్చేలా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ దిబెస్ట్“ అన్నారు.
ప్రియమణి మాట్లాడుతూ ‘‘భామా కలాపం అనేది నా డిజిటల్ బెస్ట్ డెబ్యూ అని చెప్పాలి. మొదటి షెడ్యూల్ కోసం ఆరు రోజులు కేటాయించాను. తర్వాత షెడ్యూల్ కోసం నెలన్నర పాటు సమయం కేటాయించ లేకపోయాను. తర్వాత సింపుల్‌గా, స్వీట్‌గా పూర్తి చేసేలా భరత్, అభి వర్క్ చేశారు. అనుపమ వంటి క్యారెక్టర్‌ను ఇప్పటి వరకు నేను ప్లే చేయలేదు. చాలా అమాయకమైన గృహిణి పాత్రలో కనిపిస్తాను. తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఆహా టీమ్‌కు థాంక్స్’’ అన్నారు.
సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘నేను నలబై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. అందరూ ఆదరించారు. ఇప్పుడు మా అబ్బాయి బాపినీడు, సుధీర్‌తో కలిసి ఎస్వీసీసీ డిజిటల్ మీద చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని భావిస్తున్నాం’’ అన్నారు.
దర్శకుడు భరత్ కమ్మ ,డైరెక్టర్ అభిమన్యు తాడి మేటి, సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ (రాధే శ్యామ్, డియర్ కామ్రేడ్ చిత్రాల ఫేమ్), మార్క్ రాబిన్ పాల్గొన్నారు.