Prasanth Varma: దర్శకుడు ప్రశాంత్‌వర్మ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ‘హను–మాన్’ సక్సెస్ ప్రశాంత్వర్మను స్టార్ డైరెక్టర్ని చేసింది. రూపాయికి నాలుగు రూపాయలు కలెక్ట్ చేసింది హనుమాన్. ఇంకా కొనసాగుతూనేఉంది. దీంతో ఈ సక్సెస్జోష్లో ప్రశాంత్ వర్మ ఓ ఆరు కోట్ల రూపాయాల కారును బుక్ చేశారట. హనుమాన్ నిర్మాత కె. నిరంజన్‌రెడ్డి దర్శకుడు ప్రశాంత్‌వర్మకు ఈ కారును గిప్ట్గా ఇస్తున్నారని తెలిసింది రేంజ్‌రోవర్ బ్రాండ్‌లో ఉండే ఓ హైఎండ్ వెర్షన్ కారు ఇది. ప్రస్తుతం బెంచ్ కారు వాడుతున్న ప్రశాంత్వర్మఅతి త్వరలో రేంజ్ రోవర్ కారును స్టార్ట్ చేస్తారు. ఇక ప్రస్తుతం ‘హను–మాన్’ సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ తీస్తున్నారు ప్రశాంత్‌వర్మ. అలాగే నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కళ్యాణ్‌తో అధీర అనే ఓ సినిమా చేశారు. ‘హను–మాన్’, ‘జై హను–మాన్ సినిమాల మాదిరిగా
ఇది కూడా ‘ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనీవర్స్’లో భాగంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక
‘హను–మాన్’ సినిమా భారీ సక్సెస్ కావడంతో ప్రతి సంక్రాంతికి ‘ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనీవర్స్’లో భాగంగా ఓ సినిమాను రిలీజ్ చేస్తామని చెబుతున్నారు ప్రశాంత్‌వర్మ.
HanuMan Boxoffice: హను–మాన్ రికార్డ్స్..మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!