Trivikram with PawanKalyan: ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి తొలిసారి ‘అరవిందసమేత వీరరాఘవ’ చేశారు. ఈ సినిమా హిట్. ఆ తర్వాత వెంటనే హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌లో త్రివిక్రమ్‌తోనే ఎన్టీఆర్ ఓ సినిమాను స్టార్ట్ చేశాడు. కానీ ఈసినిమా ఆగిపోయింది. మహేశ్‌బాబుకు త్రివిక్రమ్ షిప్ట్ అయ్యాడు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్తో బిజీ అయిపోయారు. ‘గుంటూరుకారం’ ఇటీవల విడుదలై హిట్ కాలేకపోయింది. దీంతో త్రివిక్రమ్–ఎన్టీఆర్ కాంబినేషన్ మళ్లీ తెరపైకి వచ్చింది.
పవన్‌కళ్యాణ్‌తో ‘అజ్ఞాతవాసి’వంటి ప్లాఫ్ మూవీని తీసిన త్రివిక్రమ్, ఆ తర్వాత వెంటనే అల్లు అర్జున్‌తో ‘అల…వైకుంఠపురములో..’ తీసి బ్లాక్‌బస్టర్ కొట్టాడు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా 260 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, రికార్డు సృష్టించింది. ఇప్పుడుమహేశ్బాబుతో త్రివిక్రమ్ ‘గుంటూరుకారం’ ప్లాఫ్. సెంటిమెంట్ ప్రకారం …నెక్ట్స్ మూవీ హిట్ కావాలి.ఈ కసి త్రివిక్రమ్లోనూ ఉంటుంది. ఈ దశలో ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ సినిమా తీస్తే అది బ్లాక్‌బస్టర్ అవుతుందని ఎన్టీఆర్ ప్యాన్స్ ఆశపడ్డారు. కానీ ఈ చాన్స్‌ను పవన్‌కళ్యాణ్ ఎగరేసుకుపోతున్నాడనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. పవన్‌కళ్యాణ్‌కు త్రివిక్రమ్ ఓ కథను రెడీ చేస్తున్నాడని సమాచారం. ఏపీ ఎలక్షన్స్పూర్తయిన తర్వాత పవన్ ఈ సినిమాను స్టార్ట్ చేస్తాడట. ఈ లోపు కథ కూడా పూర్తవుతుంది. మరోవైపు కొరటాల శివతో ఎన్టీఆర్ దేవర చేస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల అవుతుంది.