బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. ఫిబ్రవరి 1న బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన క్యారెక్టర్ టీజర్ విడుదల చేశారు.
‘పంచతంత్రం’లో వేదవ్యాస్ పాత్రలో బ్రహ్మానందం నటిస్తున్నట్టు దర్శకులు హర్ష పులిపాక. తెలిపారు. ఆలిండియా రేడియోలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి వేదవ్యాస్. ఆయన కుమార్తె పాత్రను స్వాతి రెడ్డి చేశారు. ‘జర్నీ ఆఫ్ వ్యాస్’ పేరుతో విడుదల చేసిన టీజర్లో అరవైయేళ్ల వయసులో కథల పోటీల్లో పాల్గొనడానికి వెళ్లిన వ్యక్తిగా బ్రహ్మానందాన్ని చూపించారు. సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీ, ఇతర వివరాలు వెల్లడికానున్నాయి