హారర్ కామెడీ, జాతిరత్నాలు లాంటి బడ్డీ కామెడీ సినిమాలకు టాలీవుడ్లో మంచి గిరాకీ ఉంది. ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్ ఉంది. ఈ రెండు అంశాలను మిక్స్ చేసుకుని వచ్చిన ‘ఓం భుమ్ భుష్’
చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందా? రివ్యూ చదివేయండి.
ప్రధాన తారాగణం: శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ప్రీతిముకుందన్, ఆయేషాఖాన్, ప్రియా వడ్లమానీ, శ్రీకాంత్ అయ్యంగర్
దర్శకుడు: ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి
నిర్మాతలు:సునీల్ బలుసు, వీ సెల్యూలాయిడ్
సంగీత దర్శకులు: సన్నీ ఎమ్ ఆర్
కెమెరా: రాజ్ తోట
ఎడిటింగ్: విష్ణువర్థన్ కావూరి
కథ
క్రిష్ (శ్రీవిష్ణు), వినయ్ మానుకోండ (ప్రియదర్శి), మాధవ్ (రాహుల్ రామకృష్ణ) ఉస్మానియా యూనీ వర్సటీలో తిష్ట వేసిన పీహెచ్డీ స్కాలర్స్. సైంటిస్ట్‌లు కావాలనుకునే వీళ్లకి లైఫ్ పట్ల సీరియస్ నెస్ ఉండదు. దీంతో కాలేజీవాళ్లు బలవంతంగా వీరిని బయటకు పంపుతారు. దీంతో జీవనధారం కోసం వాళ్లకు‘బ్యాంగ్బ్రోస్’ అనే పేరు పెట్టుకుంటారు. ఈ క్రమంలో ఈ బ్యాంగ్బ్రోస్ భైరవపురం వెళ్తారు. అక్కడసంపంగి మహాల్‌లోని ఓ నిధిని అన్వేషించాలనుకుంటారు. మరి…నాలుగు వందల సంవత్సరాలుగా సంపంగి అనే భూతం భైరవపురంలోని సంపంగి కోటలోనే ఎందుకు ఉంది. ఈ సంపంగి మహాల్‌తో క్రిష్‌కు ఉన్న అనుబంధం ఏమిటి? జలజాక్షి (ప్రీతి)తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా ఉంటుంది? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ
ముగ్గురు బడ్డీ స్నేహితుల కామెడీకి హారర్ జోడించి కథ చెప్పాలనుకున్నాడు దర్శకుడు శ్రీ హర్ష. ‘బ్రోచెవారెవరురా’ సినిమాలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల కామెడీ బాగా వర్కౌట్అయింది. సో…ఈ ప్రకారం కూడా ‘ఓం భూమ్ బుష్’కు ఈ ముగ్గుర్నే ఎంచుకున్నాడు దర్శకుడు. కాలేజీ నుంచి క్రిష్ (శ్రీవిష్ణు), వినయ్ మానుకోండ (ప్రియదర్శి), మాధవ్ (రాహుల్ రామకృష్ణ) ఈ ముగ్గుర్నీ బయటకు పంపడం, వీరు భైరవపురం వచ్చి, ఆ గ్రామ ప్రజలను మచ్చికచేసుకునే ప్రయత్నాలు చేయడం వంటి సన్నివేశాలతో తొలిభాగం ముగుస్తుంది. ఈ ముగ్గురు సంపంగి మహాల్‌కి రావడం, నిధి అన్వేషణ, ప్రీ క్లైమాక్స్‌లో సంపంగి పాత్రతో ఎమోషన్‌తో కథ ముగుస్తుంది.
కథలో కామెడీ ఉంది. కానీ ఇది పూర్తి స్థాయి క్లీన్ కామెడీ అని చెప్పలేం. ప్రతి కామెడీ సీన్ సంద ర్భానుసారంగ ఉండదు. డైలాగ్స్, పంచ్‌లు, శ్రీవిష్ణు, రాహుల్, ప్రియదర్శిల టైమింగ్…ఇలా కామెడీ ఉంటుంది. సెకండాఫ్‌లో ప్రియదర్శి, రాహుల్‌ల మధ్య సన్నివేశాలు బాగుంటాయి. ఇక సంపంగి ట్రాక్ ఎంత ఎఫెక్టివ్‌గా ఏం ఉండదు. కోర్ ఎమోషన్ కూడా టీమ్ ఫీలయినంత బలంగా ఆడియన్స్ ఫీల్ కాకపోవచ్చు. లవ్‌స్టోరీ ట్రాక్ కరెక్ట్‌గా ఉండదు. యూనిట్ చెప్పినట్లు లాజిల్లు లేకుండా చూస్తే థియేటర్స్‌లో కాసేపు నవ్వుకోవచ్చు. కానీ కొన్ని పిచ్చి సన్నివేశాలను కాస్త ఓపిగ్గా భరించాలి. యూట్యూబ్ వీడియోలు చూసి ఏదో వైద్యం చేయడం లాంటివి. కథనం కూడా కాసేపు కాలేజీ, కాసేపు విలేజ్, మిగతా అంతా మహాల్లో. ఇలా డిఫరెంట్‌గా ఉండటం కాస్త మైనస్ కావొచ్చు.
నటీనటులు
క్రిష్‌గా శ్రీ విష్ణు బాగా యాక్ట్ చేయడం. టైమింగ్ బాగుంది. బాడీ లాంగ్వేజ్ బాగుంది. ఎమోషనల్ సీన్లోనూ తనదైన యాక్టింగ్ మార్క్ చూపించారు. వినయ్‌గా ప్రియదర్శి, మాధవ్‌గా రాహుల్ తమ కామెడీ స్ట్రెంత్ యాక్టింగ్‌ను మరోసారి నిరూపించుకునే ప్రయత్నం చేసి, పాస్ అయ్యారు. సినిమాలో శ్రీ విష్ణు లవర్‌గా కనిపించే జలజాక్షిగా ప్రీతి పాత్ర ఏమీ ఉండదు. ప్రియదర్శి సరసన కని పించిన ఆయేషా ఖాన్ గ్లామర్‌కే పరిమితమైంది. ప్రియవడ్లమాని ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపిస్తారు. శ్రీకాంత్ అయ్యంగార్, రచ్చ రవి, ఆదిత్యామీనన్లు తమ తమ పాత్రల పరిధి చేశారు.
సంకేతిక విభాగం
హర్ష తొలిరెండు సినిమాలు ‘హుషారు’, ‘రౌడీబాయ్స్’ కాలేజీ బ్యాక్‌డ్రాప్ సినిమాలు. ఈ స్టోరీ కూడా కాలేజ్ సీన్స్‌తోనే ప్రారంభం అవుతుంది. కానీ తెలుగు సక్సెస్ ఫార్ములాలో ఒకటైన హారర్ కామెడీని డీల్ చేయడంలో శ్రీ హర్ష అనుభవలేమి అర్థం అవుతుంది. హర్షకు ఇది కొత్త జానర్. ఇక శ్రీవిష్ణు చేసిన ఆరుసినిమాలకు రాజ్ తోట కెమెరా వర్క్ చేశారు. ఆయన వర్క్ సినిమాకు లాభిస్తుంది. కొంతగ్యాప్ తర్వాతవచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ మ్యూజిక్ ఇంకాస్త సౌండ్ చేయాల్సింది. ఎండిటింగ్ ఒకే. నిర్మాణ విలువలు ఓకే.
తీర్పు
లాజిక్స్ లేకుండా కామెడీ ఇష్టపడేవారు, బడ్డీ కామెడీని మెచ్చుకునే వారికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. కానీ కొన్ని సన్నివేశాలను భరించాల్సి ఉంటుంది. కోర్ పాయింట్లో అంత ఎఫెక్టివ్ నెస్ఉండదు. సరదాకి ఓ సారి చూడొచ్చు. కానీ సినిమా క్యాప్షన్ ‘నో లాజిక్…ఓన్లీ మ్యాజిక్’ను గుర్తుపెట్టుకుని ఆడియన్స్ థియేటర్స్‌లోకి అడుగుపెడితే బెటర్.