SriVishnu Swag: శ్రీవిష్ణు కెరీర్లో ‘రాజ రాజ చోర’ సినిమా సూపర్‌హిట్. 2021 ఆగస్టులో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. హసిత్ గోలి దర్శకుడిగా పరిచయం అయ్యారు. తాజాగా శ్రీ విష్ణు, హిసిత్గోలిల కాంబినేషన్లో ‘స్వాగ్’(SriVishnu Swag) సినిమా రాబోతోంది. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీవిష్ణు ట్రిపుల్ రోల్లో కనిపిస్తారు. కాగా ఇటీవల ఓ సందర్భంగా ‘స్వాగ్’ సినిమాకథను చెప్పారు శ్రీ విష్ణు. ‘‘స్వాగ్’ చాలా పెద్ద కథ. చెప్పాలంటే..ఒకప్పుడు మగవారిని కూడా మహిళలలేపరిపాలించేవారట. పురుషులకు కూడా మహిళల ఇంటిపేర్లే ఉండేవట. అలా వరుస పరిణామాల క్రమంలో మగజాతి ఆడవారిపై ఏ విధంగా పై చేయి సాధించింది? వివాహం తర్వాత ఆడవారి ఇంటిపేర్లు ఎందుకు మారుతున్నాయి? అనే అంశాలను వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. నేను శ్వాగనీక వంశస్థుడిగా కనిపిస్తాను. కథ రిత్యా ఇందులో మూడు గెటప్స్‌లో కనిపిస్తాను’’ అని చెప్పుకొచ్చారు. అయితే ‘స్వాగ్’ సినిమా ‘రాజరాజచోర’ సినిమాకు ప్రీ క్వెల్ అనే ప్రచారం సాగుతోంది.
శ్రీవిష్ణు నెక్ట్స్ చిత్రం ‘ఓం భీమ్ బుష్’. ‘హుషారు’ ఫేమ్ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ‘బ్రోచెవారెవరురా’
తర్వాత వీరి ముగ్గురి కాంబినేషన్లో వస్తోన్న సినిమా ఇది. సైంటిస్ట్‌లు కావాలని ఉస్మానియా యూనీవర్సిటీలో చేరిన ముగ్గురు ఆకతాయి కుర్రాళ్లు భైరవపురంలోని నిధి కోసం ఏ విధంగా అన్వేషించారు?అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కాకుండా శ్రీ విష్ణు గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా కమిటైయ్యరు. ఓ థ్రిల్లర్ ఫిల్మ్ కూడా ఉంది. మేలో ఓ సినిమా మొదలుపెట్టాలను కుంటున్నారు.