NijameNeChebutunna: ‘ఊరి పేరు భైరవకోన’(Ooru Peru Bhairavakona) సినిమా 2024, ఫిబ్రవరి 16న విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘నిజమే నే చెబుతున్నా’ (Nijame Ne Chebutunna)పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. అయితే ఈ పాట ఈ సినిమా కోసం చేసింది కాదట. నాలుగు సంవత్సరాల క్రితం ఓ సినిమా కోసం చేయగా, ఆ సినిమాలో పెట్టెందుకు వీలు పడలేదట. దీంతో అలా నాలుగు సంవత్సరాలుగా వివిధ సినిమాల ఆల్భమ్స్‌లో భాగం కావడానికి ఈపాట ప్రయత్నిస్తూనే ఉంది. కానీ సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర ఫైనల్‌గా ఈ పాటను ‘ఊరి పేరు భైరవకోన’లో పెట్టారు. ఈ విషయాలను ‘ఊరి పేరు భైరవకోన’ నిర్మాత రాజేష్ దండా వెల్లడించారు. 2023, మార్చి 31 విడుదలైన ఈ లిరికల్ వీడియో పాట, ప్రస్తుతం యూట్యూబ్‌లో శ్రోతలను ఆకర్షిస్తోంది. ఇప్పటికే 70 మిలియన్ల వ్యూస్‌ను దాటేసింది.
‘టైగర్’ చిత్రం తర్వాత సందీప్‌కిషన్, వీఐ ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా 2024, ఫిబ్రవరి 16న విడుదల కానుంది. ఈ చిత్రంలో కావ్యాథాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్‌గా నటించారు. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించారు. ఇక ‘భైరవకోన’ అనే ఊరిలో సాగే ఓ మిస్టీరియస్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉండబోతుంది. ఈ సినిమాకు పాతిక కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు, సినిమాలో 47 నిమిషాలు గ్రాఫిక్ విజువల్స్ ఉన్నట్లుగా నిర్మాత రాజేష్ దండా చెప్పుకొచ్చారు. 102 రోజుల పాటు షూటింగ్ జరిగింది ఈ సినిమాకు. 80 రోజులు నైట్ షూట్స్ జరిగాయి. హీరోయిన్ కావ్యాథాపర్కు ఓ సందర్భంగా యాక్సిడెంట్ కావడం, కోవిడ్ తదితర కారణాల వల్ల ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడింది. ‘కాంతార’, ‘విరూపాక్ష’ సినిమాల కంటే ముందే ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా మొదలు కావడం విశేషం.