Nani with Prashanthneel: టాలీవుడ్‌లో ప్రజెంట్ చాలామంది హీరోలు పాన్ ఇండియా ఫిల్మ్ మంత్రం జపిస్తున్నారు. టాప్ హీరోలైతే మరీనూ. ఇప్పుడు ఈ పాన్ ఇండియా మంత్రాన్ని పఠించేందుకు హీరో నాని కూడా రెడీ అయ్యారన్నది ఫిల్మ్ నగర్ లేటెస్ట్ టాక్. ‘కేజీఎఫ్’ వంటి హిట్ ఫిల్మ్‌ను తీసిన ప్రశాంత్ నీల్, హీరో నాని కాంబినేషన్‌లో ఓ సిని మా రానున్నది అన్నది టాలీవుడ్ గాసిప్ రాయుళ్ల మాటలు. ప్రశాంత్ నీల్ ప్రజెంట్ ప్రభాస్‌తో ‘సలార్’ తీస్తున్నాడు. ఆ నెక్ట్స్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలి. రామ్‌చరణ్‌తో ప్రశాంత్‌నీల్‌కు ఓ కమిట్‌మెంట్ ఉంది. మరి.. ప్రశాంత్ నీల్ ఈ సినిమా లన్నింటినీ ఎప్పుడు కంప్లీట్ చేయాలి? నానితో ఎప్పుడు సినిమా చేయాలి? అన్న ప్రశ్నలకు సమాధానం అయితే ఇప్పట్లో దొరకదు. (Nani with Prashanthneel)
Vishal Laatti: మార్పు కోరే లాఠీ
ఇక ప్రజెంట్ నాని హీరోగా నటించిన ‘అంటే..సుందరానికీ’ చిత్రం జూన్ 10న రిలీజ్ కానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో మలయాళ బ్యూటీ నజ్రియా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం అవుతున్నారు. అలాగే నాని ‘దసరా’ అనే యాక్షన్ ఫిల్మ్ కూడా చేస్తున్నారు. ‘నేనులోకల్’తర్వాత నాని, కీర్తీ సురేశ్‌లు జంటగా నటిస్తున్న చిత్రం ఇది. ‘దసరా’ను ఈ ఏడాది దసరా పండగ సమయంలో రిలీజ్ చేయాలని నాని అండ్ కో రెడీ అవుతున్నారని తెలిసింది.