Vishal Laatti: విశాల్ కధానాయకుడిగా ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లాఠీ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్ (Vishal Laatti) ఆగస్టు 12న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశాల్ సరసన ఈ చిత్రంలో సునైనా కథానాయికగా నటిస్తుంది.
Get ready to witness #Laththi in theatres worldwide from #August12th 2022.
Stay tuned for my Chapter Of #Enmity. #LaththiCharge #LaththiFromAug12@_RanaProduction @dir_vinothkumar @actorramanaa @nandaa_actor @balasubramaniem @PeterHeinOffl @thisisysr @DOP_bala @TheSunainaa pic.twitter.com/8pefRPBNRK
— Vishal (@VishalKOfficial) May 22, 2022
సమాజంలో మార్పు తెచ్చే శక్తి లాఠీకి వుంది. విశాల్ ఆ ‘లాఠీ’ తో సమాజంలో ఎలాంటి మార్పులకు నాంది పలికారో అన్నది ఆసక్తికరం. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి అన్ని భాషలకు ఒకే టైటిల్ పెట్టారు. ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ని దర్శకుడు వినోద్ కుమార్ సరికొత్త కథాంశంతో తెరకెక్కించారు. ఈ చిత్రంలో విశాల్ ఫుల్ లెంత్ యాక్షన్ కి ప్రాధాన్యత వున్న పాత్రలో నటిస్తున్నారు.
Director Harish Shankar: సల్మాన్‌ఖాన్‌తో గబ్బర్‌సింగ్ డైరెక్టర్!
ఈ చిత్రం కోసం అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ద్వితీయార్ధంలో ఉండే 45నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. దిలీప్ సుబ్బరాయణ్ మరో స్టంట్ మాస్టర్ గా పనిచేశారు. బాలసుబ్రమణ్యన్ ఛాయాగ్రహకుడిగా, సామ్ సిఎస్ సంగీత దర్శకుడిగా, పొన్ పార్థిబన్ రచయితగా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.