షారుక్‌ఖాన్ తాజా చిత్రం ‘పఠాన్’ బాక్సాఫీస్ లెక్కల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం రూ.1000 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యికోట్ల రూపాయల వసూళ్ళను సాధించిన రెండో హిందీ చిత్రంగా ‘పఠాన్’ నిలిచింది. దేశవ్యాప్తంగా అత్యధికంగా వసూళ్ళుసాధించిన హిందీ చిత్రంగా కూడా ‘పఠాన్’ నిలిచింది. అలాగే దేశవ్యాప్తంగా నెట్ గ్రాస్ కలెక్షన్స్‌లో బాహుబలి: ది కన్‌క్లూజన్ పేరిట ఉన్న టాప్ ప్లేస్‌ను పఠాన్ కొట్టేశాడు. దాదాపు 510 కోట్ల నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను సాధించి, హిందీలో ఈ విభాగంలో టాప్ ప్లేస్‌లో ఉన్న ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ రికార్డును అధికమించింది ‘పఠాన్’. ఇప్పటికే పఠాన్ చిత్రం నెట్ కలెక్షన్స్ రూ.510 కోట్ల రూపాయాలను దాటేసి, ఇంకా నాటౌట్‌గానే ఉంది.
‘పఠాన్’ ఖాతాలో ఇన్ని రికార్డులు చేరపోయి ఉండేవి. ‘పఠాన్’ చిత్రం విడుదలైన నాలుగోవారంలో వసూళ్ళు బాగా నెమ్మదించాయి. రూ.1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ కూడా సాధించే సీన్‌లేదప్పుడు. కానీ ‘పఠాన్’ చిత్రంయూనిట్ తెలివిగా ఆలోచించి, పరిమిత మల్టీప్లెక్స్‌లలో సినిమాటికెట్ ధరలను తగ్గించడం, ఫెస్టివల్ అండ్ నేషనల్ హాలీడే సమయంలో స్పెషల్ ఆఫర్స్ ఇవ్వడంవంటి చర్యలతో బాక్సాఫస్ రన్‌లో నాటౌట్‌గా మిగిలింది. ఈ క్రమంలో రూ. 1000 కోట్ల క్లబ్‌లోకూడా చేరింది. కొత్త రికార్డును నమోదు చేసింది ‘పఠాన్’ చిత్రం.
This weekend, don't miss the #PathaanCelebrations offer. Buy 1 ticket & get 1 free, only today & tomorrow. First come, first serve basis. T&C apply.
Book your tickets now – https://t.co/SD17p6x9HI pic.twitter.com/80IegMHAYm
— Yash Raj Films (@yrf) March 4, 2023
Congratulations to @iamsrk sir, #SiddharthAnand @yrf and the entire team of #Pathaan on crossing @BaahubaliMovie 2 Hindi NBOC. Records are meant to be broken and I am happy it was none other than @iamsrk who did it! 😃 https://t.co/cUighGJmhu
— Shobu Yarlagadda (@Shobu_) March 4, 2023
హిందీలో ‘పఠాన్’ చిత్రం ఇన్ని కలెక్షన్స్‌ను సాధించినప్పటికీని దేశవ్యాప్తంగా హిందీలో అత్యధిక గ్రాస్‌కలెక్షన్స్‌ను సా«ధించిన రికార్డు రూ.709 కోట్ల రూపాయాలతో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ పేరిటే ఉంది.మార్చి 2 నాటికి ‘పఠాన్’ ఈ విషయంలో రూ.640 కోట్ల రూపాయలను సాధించి, ఇంకా నాటౌట్‌గానేనిలిచింది. ఇలా ఇండియాలో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిన హిందీ చిత్రం రికార్డును ‘పఠాన్’పేరిట లిఖించబడాలంటే ఆ చిత్రం ఇంకా 70 కోట్లు సాధించాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ‘పఠాన్’మరో 70 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించడం అనేది దాదాపు ఆసాధ్యమే (పఠాన్ చిత్రంఏదైనా మ్యాజిక్ చేస్తే తప్ప..). మరి.. ఏం జరుగుతుందో చూడాలి.
ఇక షారుక్‌ఖాన్ హీరోగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ‘పఠాన్’ చిత్రం 2023, జనవరి 25నథియేటర్స్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటించగా, జాన్ అబ్రహాం మరో లీడ్ రోల్ చేశాడు.