Trivikram: ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన ‘గుంటూరు కారం’ రిజల్ట్ తేడా కొట్టింది. అయినా త్రివిక్రమ్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. త్రివిక్రమ్ చుట్టూ ఎన్నో సినిమాల కథలు తిరుగుతున్నాయి. త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమా అనౌన్స్మెంట్ ప్రకారం అల్లు అర్జున్‌తో ఉండాలి. కానీ ఇందుకు కాస్త సమయం ఉంది. దీంతో త్రివిక్రమ్ డైరెక్షన్లో నాని–వెంకటేష్‌లు ఓ మల్టీ స్టారర్ సినిమా సెట్స్‌కు వెళ్తుందనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు ఫుల్స్టాప్ పడకముందే పవన్‌కళ్యాణ్ తో త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా అంటూ మరో గ్యాసిప్ తెరపైకి వచ్చింది. త్రివిక్రమ్ మాటను పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ ఒకే చేస్తారు. అలాంటిది తానే దర్శకత్వం వహిస్తానంటే పవన్‌కళ్యాణ్ కాదంటారా? కాదనరు. తప్పకుండా చేస్తారు అనేది ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్నమాట. గతంలో పవన్–త్రివిక్రమ్ కాంబి నేషన్‌లో ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’, ‘అజ్ఞాతవాసి’ వంటి సినిమాలు వచ్చాయి.
అలాగే త్రివిక్రమ్సినిమాలు ఎప్పుడూ హారిక అండ్ హాసిని బ్యానర్లో ఉంటాయి. అయితే ఈ బ్యానర్లో కాకుండ త్రివిక్రమ్ మరో బ్యానర్లో ఓ సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మరో టాక్. ఇలా త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమాను గురించిన ఎన్నో కథలు ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ చర్చగా మారాయి. మరి..త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేస్తారో చూడాలి.