Beast vs KGF2: యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ బాక్సాఫీసు రికార్డుల దుమ్ముదులిపింది. మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ‘కేజీఎఫ్ చాప్టర్ 2’తో యశ్ మళ్లీ వస్తున్నాడు. ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2 విడుదల కానుంది. హోంబలే ఫిలిం పతాకంపై విజయ్ కరంగదూర్ నిర్మించిన ఈ చిత్రం ఇది. అయిఏ కేజీఎఫ్‌చాప్టర్ 1కు ఉన్న వసూళ్ల రికార్డులను దృష్టిలో పెట్టుకుని ఇదే రోజున మరో సినిమాను విడుదల చేయడానికిఏ సినిమా నిర్మాతలు సాహసం చేయలేదు. అయితే సన్‌పిక్చర్స్ నిర్మాత కళానిధిమారన్ రెడీ అయ్యారు. విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ నిర్మించిన బీస్ట్ చిత్రం ఏప్రిల్ 13న విడుదల కానుంది. మార్చి 22న అధికారిక ప్రకటన వెల్లడైంది. తమిళ న్యూ ఇయర్ కాబట్టి బీస్ట్ చిత్రాన్ని ఏప్రిల్ 13న విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది (Beast vs KGF2)
అయితే కేజీఎఫ్ 2 మాదిరిగానే బీస్ట్ సినిమాను కూడా తెలుగు, తమిళం, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. తెలుగులో నిర్మాతలు ‘దిల్’రాజు, ఏషియన్ సునీల్ నారంగ్, డి. సురేష్ బాబు విడుదల చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఏప్రిల్ 13న బీస్ట్ విడుదలైన రోజున ఏ ప్రాబ్లమ్ లేదు. కానీ ఏప్రిల్ 14 కేజీఎఫ్ 2 రిలీజ్ అయితే బీస్ట్ చిత్రానికి థియేటర్స్ కొరత సమస్య ఏర్పడే అవకాశం ఉంది. ఒకవేళ బీస్ట్ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తే తప్ప థియేటర్స్ అన్నీ కేజీఎఫ్ 2 కు వెళ్తాయి. అయితే
తమిళ ప్రజలకు విజయ్ ముఖ్యం. కాబట్టి తమిళనాడులో బీస్ట్ రిలీజ్ ఎఫెక్ట్ కేజీఎఫ్ 2పై తప్పక పడుతుంది.
పైగా ప్రాంతీయ అభిమానం మెండుగా ఉన్న తమిళులు కచ్చితంగా థియేటర్స్ విజయ్ బీస్ట్‌కే కేటాయిస్తారు.
మరి..ఈ ప్రకారం కేజీఎఫ్‌కు తమిళనాడులో వసూళ్ల పరంగా బీస్ట్ దెబ్బతీసినట్లే.