Ajay Devgn Runway34: అజయ్ దేవగన్, అమితాబ్‌బచ్చన్, రకుల్‌ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రన్ వే 34’. అజయ్దేవగనే ఈ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్ 29న ఈ సినిమాను(Ajay Devgn Runway34) విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో పైలైట్స్గా అజయ్ దేవగన్, రకుల్‌ప్రీత్ సింగ్ కనిపిస్తారు. ఓ మిస్టీరియస్ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తారు. ప్రవర్తన సరిగా లేని ఓ ప్రముఖ పైలైట్ ఓ విమానాన్ని నడుపుతున్నప్పుడు ల్యాండింగ్ ఇష్యూస్‌లో జరిగే పొరపాట్లు, అజయ్ దేవగన్ తప్పులను క్వశ్చన్ చేసే పాత్రలో అమితాబ్, అజయ్ దేవగన్ తప్పుకు పశ్చాత్తపం పడే కో పైలైట్‌గా రకుల్ కనిపిస్తారు. ఫ్లైట్ ల్యాండింగ్ ఇష్యూస్‌కు, పౌరవిమానయాన శాఖ మంత్రికి ఉన్న లింక్ ఏంటి అనేది థియే టర్స్‌లో చూడాలి. ఈ చిత్రంలో బొమన్ ఇరానీ, ఆకాంక్షాసింగ్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ‘రూల్స్ ఫాలో అవుతావా?’, చేసిన తప్పులనే మళ్లీ చేయాలా? అన్న డైలాగ్స్ ట్రైలర్లో వినిపిస్తాయి.
Read more :Runway34:35 వేల అడుగుల ఎత్తులో నిజం!