సినిమా: ది కేరళస్టోరీ (The Keralastory)
ప్రధానతారాగణం: అదాశర్మ, సిదిఇద్నానీ, యోగితా బిహాని, సోనియా బలానీ
దర్శకత్వం: సుదీప్తో సేన్
నిర్మాత: విపుల్ షా
మ్యూజిక్: వీరేష్ శ్రీవాల్సా, బిషాక్ జ్యోతి
ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన హిందీ చిత్రం ‘ది కేరళస్టోరీ’. మత సామరస్వాన్ని ఈ సినిమా దెబ్బ తీస్తుందనే ఉద్దేశంతో ఈ సినిమాను బ్యాన్ చేయా లన్నట్లుగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయపడ్డాయి. కోర్టుల్లో కూడా ఈ సినిమా ఇష్యూ నడిచింది. అయితే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో ఈ సినిమా రిలీజ్ సాధ్యమైంది. మరి..వివాదాలు చెలరేగాల్సినంత అంశాలు ఈ సినిమాలో ఏమీ ఉన్నాయి? అసలు..దర్శకుడు ‘ది కేరళస్టోరీ’లో ఏం చెప్పారో ఓ సారి రివ్యూలో చదవండి.
కథ:
కేరళలోని కాసరగౌడ్లో నర్సింగ్ స్కూల్లో చదువు పూర్తి చేసుకోవడం కోసం షాలిని(ఆదాశర్మ), గీతాంజలి(సిది ఇద్నానీ), నిమ్షా(యోగితా), అసిఫా(సోనియా) రూమ్మెంట్స్ అవుతారు. షాలిని,గీతాంజలి క్రిస్టియన్స్. కానీ అసిఫా ఎజెండా వేరు. ఆమె లక్ష్యం చదువు పూర్తి చేయడం కాదు. తన రూమ్మెంట్స్ని బ్రెయిన్ వాష్ చేసి ఇస్లామ్ మతంలోకి కన్వర్ట్ చేయడం. ఇందుకోసం అసిఫా కొందరి అబ్బాయిల సహాయం తీసుకుంటుంది. వీలైనప్పుడల్లా షాలిని, గీతాంజలిలపై అసిఫా తన మాటలప్రభావం చూపిస్తుంది. అయితే షాలిని జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆమె అసిఫామాటలను వినేలా చేస్తుంది. ఈ క్రమంలో తనకు తెలియకుండానే తాను ఉగ్రవాదాల ట్రాప్‌లో పడుతుంది. తానుఓ ఉగ్రవాదిగా మారుతుంది. క్యాంపుకు వెళ్లిన తర్వాత షాలిని ఏం చేసింది? అసలు..షాలిని, గీతాంజలి జీవితాల్లో ఏం జరిగింది? ఐఎస్ఐఎస్(ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా) క్యాంపులోకి వెళ్లిన తర్వాత షాలిని ఎలాంటి భయంకరమైన సంఘటనలను ఎదుర్కొంది? ఏఏ షాకింగ్ విషయాలు తెలుసుకుంది? షాలిని ఫాతిమాగా ఎలా మారింది? అన్నదే ‘ది కేరళస్టోరీ’ కథనం.
విశ్లేషణ
ఓ ఇన్వేస్టిగేషన్ రూమ్‌లో షాలిని తన దర్భురజీవితాన్ని, తన ప్లాష్బ్యాక్ను చెప్పే సన్నివేశాలతో ‘ది కేరళస్టోరీ’ చిత్రం ప్రారంభం అవుతుంది. సినిమా మేజర్‌గా షాలిని కోణంలోనే సాగుతుంది. హాస్టల్ సన్నివేశాలను బాగా చిత్రీకరించారు. షాలినిని అసిఫా బ్రెయిన్‌వాష్ చేసే సీన్స్ అంత ఎఫెక్టివ్‌గా అనిపించవు. ముఖ్యంగా ఐఎస్ఐఎస్(ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా) బానిసల క్యాంపు సన్నివేశాల్లో ఉన్న ఓ రేప్ సీన్ ఆడియన్స్‌ను కలవరపరచేలా ఉంటుంది. ఈ సినిమాలో వినోదం కంటే ఎక్కువఒకరకమైన మతమార్పుడులు ఏ విధంగా చోటుచేసుకుంటాయి? అన్న సన్నివేశాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సినిమాపై ఏడు సంవత్సరాలు వర్క్ చేసినట్లు, వాస్తవ సంఘటనల ఆధారంగా తీసినట్లు దర్శకులు సుదీప్తో సేన్ పేర్కొన్నారు. ఈ తాలుకూ హార్డ్‌వర్క్ సినిమాలో కనిపించదు. సినిమా కాస్త స్లోగా ఉంటుంది. అయితే కొన్నివర్గాల వారికి ఈ సినిమా అంత నచ్చకపోవచ్చు.
నటీనటుల పెర్ఫార్మెన్స్
ఆదాశర్మ అద్భుతంగా నటించారు. తనలోని నటిని ప్రూవ్ చేసుకునే అద్భుత అవకాశం ఆమెకు ‘ది కేరళస్టోరీ’లో దక్కిందని చెప్పవచ్చు. మంచి రోల్ చేశారు. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన ప్రేక్షకులనుఆశ్చర్యపోయేలా చేస్తుంది. ముఖ్యంగా సినిమాలో ఐఎస్ఐఎస్(ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా)కొన్ని సీన్స్‌లో ఆదాశర్మ యాక్టింగ్‌లో పరిణితి కనిపిస్తుంది. ఇక మరోనటి సిది ఇద్నానీ, సోనియాలకు మంచిలీడ్ రోల్స్ దక్కాయి. ఈ ఇద్దరు బాగా యాక్ట్ చేశారు. ప్రణయ్ మిశ్రా, ప్రణయ్ పచౌరి వారి పాత్రల మేర మెప్పించారు. కొన్ని సీన్స్‌లో బ్యాగ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదనిపిస్తుంది. కెమెరామేన్ పనితనం కనిపిస్తుంది.