మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్‌గా రూపొందుతోన్న ‘భీమ్లానాయక్’ చిత్రం విడుదలపై మరోసారి సందిగ్దత నెలకొని ఉంది. జనవరి 12 నుంచి వాయిదా పడిన ఈ చిత్రం ఫిబ్రవరి 25నవిడుదల కావాల్సింది కానీ ఇదే తేదీన శర్వానంద్, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘ఆడ వాళ్లు మీకు జోహార్లు’ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. దీంతో పవన్‌కల్యాణ్, రానా హీరోలుగా సాగర్‌కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న ‘భీమ్లానాయక్’ ఫిబ్రవరి 25న విడుదల కావడం లేదని స్పష్టమైపోయింది. పవన్‌కల్యాణ్ సినిమా విడుదల అవుతోన్న రోజునే తన సినిమాను విడుదల చేసేందుకు శర్వానంద్
సాహసించరు. పైగా శర్వాకు ఈ సమయంలో తప్పనిసరిగా ఓ హిట్ కావాలి. సో..పరిణామాలను చూస్తుంటే
‘భీమ్లానాయక్’ సినిమా వాయిదా పడినట్లే తెలుస్తోంది. అయితే ‘భీమ్లానాయక్’ సినిమా ఎప్పుడు విడుదల
అవుతుంది? అనే విషయంపై త్వరలో క్లారిటీ రావాల్సి ఉంది. ఏప్రిల్ 1న భీమ్లానాయక్ రిలీజ్ అయ్యే చాన్సెస్
ఉన్నాయని తెలిసింది.
భీమ్లానాయక్ వాయిదా
Leave a comment
Leave a comment