షారుక్‌ఖాన్ చేసిన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా వెయ్యికోట్ల క్లబ్లో చేరిన రెండో హిందీ సినిమా(తొలి సినిమా ‘దంగల్’) నిలిచింది. షారుక్ కెరీర్లోహాయ్యస్ట్ గ్రాసర్ ఫిల్మ్ కూడా ఇదే. అలాగే హిందీ లో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా కూడ ‘పఠాన్’ రికార్డులు సృష్టించింది. అయితే హిందీలో ‘బాహుబలి:ది కన్‌క్లూజన్’ సాధించిన 1020 కోట్ల రూపాయాల వసూళ్ళనుదాటే శాడు పఠాన్. హిందీలో అత్యధిక షేర్ సాధించిన రికార్డు బాహుబలి: ది కన్ క్లూజన్‌పై ఉండేది. ఇప్పుడు అది ‘పఠాన్’పేరు పైకి వచ్చేసంది.
సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్‌ఖాన్ హీరోగా, జాన్ అబ్రహాం, దీపికాపదుకొనె ప్రధాన పాత్రల్లో నటించిన ‘పఠాన్’ సినిమా 2023, జనవరి 25న విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక ప్రస్తుతం రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వంలో ‘డంకీ’, అట్లీ దర్శకత్వంలో ‘జవాను’ సినిమాలు చేస్తున్నారు షారుక్‌ఖాన్.