రాజమౌళి సినిమాలకు ఓ స్టైల్ ఉంది. సినిమా స్టార్టింగ్ స్టేజ్‌లోనే మీడియా ముఖంగా ఆ సినిమాను గురిం చిన కథ, నేపథ్యం, నిర్మాణం, నటీనటుల వివరాలను వెల్లడిస్తారు. ఇలా గతంలో కొన్ని సినిమాలకు చేశారు రాజమౌళి. ఆయన గత చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లోనూ ఇదే ఫార్మాట్‌ను ఫాలో అయ్యారు. ప్రస్తుతం మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నారు రాజమౌళి. ఈ సినిమా మేకోవర్‌కు సంబంధించిన ఫిట్నెస్ వర్క్‌షాప్ కోసం మహేశ్‌బాబు జర్మనీ వెళ్లి తిరిగొచ్చారు. ఈ సినిమా కథ పూర్తయినట్లు ఈ చిత్రం కథారచయిత విజయేం ద్రప్రసాద్ ఆల్రెడీ వెల్లడించి, ఎమ్ఎమ్ కీరవాణి సంగీతంకు సంబంధించిన వర్క్స్‌ను కూడా స్టార్ట్ చేసిన ట్లుగా తెలిపారు. అలాగే ఈ సినిమా పూజాకార్యక్రమాలు ఈ ఏడాది ఉగాదికి జరుగుతాయని, 2026ఉగాదికి సినిమాను విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తన గత సినిమాల మాదిరి గానే… మహేశ్‌తో రాజమౌళి చేయబోయే సినిమాను గురించిన వివరాలు మీడియా ముఖంగా వెల్లడిస్తారా? అనే చర్చ జరుగుతోంది ఇండస్ట్రీలో. రాజమౌళి ఇలానే చేయాలని, వివరాలను ముందుగానే వెల్లడిస్తే అన వసరపు గ్యాసిప్స్‌కు తావుండదని మహేశ్ సూపర్‌ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వివరాలను మీడియా ముఖంగా వెల్లడించే సమయంలో రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు రాజమౌళి. మరి. మహేశ్ సినిమా విషయంలోనూ రాజమౌళికి రిలీజ్‌డేట్‌పై క్లారిటీ ఉందా? అనేది చూడాలి. అయితే రాజమౌళి సినిమాల విడుదలలు తరచూ మారుతూ ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా కోసం మహేశ్ బాబు దాదాపు మూడుసంవత్సరాల సమయం కేటాయించారని, నిర్మాణంలో భాగస్వామిగా ఉంటారనే టాక్ వినిపిస్తోంది. ఆఫ్రికన్ ఫారెస్ట్స్ నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉంటుందని ఓ సందర్భంగా విజయేంద్రప్రసాద్ పేర్కొన్నారు
ఆ మీటింగ్‌లో రాజమౌళి రిలీజ్ డేట్ చెబుతారా?
Leave a comment
Leave a comment