చిన్న సినిమాగా విడుదలైన ‘బేబీ’(Baby) సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. కేవలం 5కోట్ల రూపాయాలలోపు బడ్జెట్‌తోనే నిర్మించబడ్డ ‘బేబీ’ సినిమా ఇప్పటివరకూ (జూలై 27) వరకు 70 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను వసూలు చేసినట్లుగా చిత్రంయూనిట్ పేర్కొంది. ఆనంద్ దేవరకొండ, తెలుగు హీరోయన్ వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్‌లు ప్రధాన పాత్రధారులుగా నటించిన రొమాంటిక్ లవ్‌స్టోరీ ‘బేబీ’. సంపూర్ణేష్‌బాబు హీరోగా నటించిన ‘హృదయకాలేయం’, ‘కొబ్బరిమట్ట’ సినిమాకు దర్శకుడిగా, సుహాస్ హీరోగా నటించిన ‘కలర్‌పోటో’కి రచయితగా, నిర్మాతగా ఉన్న సాయిరాజేష్ ‘బేబీ’ సినిమాకు దర్శకత్వం వహించారు గతంలో విజయ్‌దేవరకొండ హీరోగా నటించిన ‘టాక్సీవాలా’ సినిమాను నిర్మించిన ఎస్కేఎన్ ‘బేబీ’ సినిమాను నిర్మించాడు.
అసలు వివాదం ఏమిటి?
ఓ సినిమా స్క్రిప్ట్ రెడీ అయినప్పుడు అదీ ఓ ముగ్గురు లేదా నలుగురు హీరోల దగ్గరకు వెళ్లడం (కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువమంది) సినీ పరిశ్రమలో కామన్. అలా ఆనంద్దేవరకొండకు ‘బేబీ’ సినిమా కథ చెప్పకముందు, ఈ చిత్రం దర్శకుడు సాయిరాజేష్, నిర్మాత ఎస్కేఎన్ ‘బేబీ’ కథను విశ్వక్సేన్కు చెప్పాలనుకున్నారు. అయి తే ‘కొబ్బరిమట్ట’ వంటి సినిమాను తీసిన దర్శకుడితో తాను సినిమా చేయనని, కథ కూడా విననని, ఆ సమయమే వృథా అన్నట్లుగా విశ్వక్సేన్ అన్నాడని, ఆ మాటలు తనను ఎంతగానో బాధించాయని, ఆ కసితోనే బీబీ సినిమాను తీసి, హిట్ కొట్టానని సాయి రాజేష్ చెప్పుకొచ్చారు. దీంతో విశ్వక్సేన్ తీరుపై సోషల్‌మీడియలో నెటిజన్లు అతన్ని విమర్శించడం స్టార్ట్ చేశారు. దీనికి తోడు ‘బేబీ’ సినిమా అప్రియేషన్ మీట్లో విశ్వక్సేన్పై అల్లు అర్జున్ పరోక్షంగా విమర్శించడంతో ఈ వివాదం మరింత పెద్దది అయినట్లు అనిపించింది.
బిర్యానిని కాను: విశ్వక్సేన్
బేబీ వివాదంపై ‘పేకమేడలు’ సినిమా ఈవెంట్లో పరోక్షంగా స్పందించారు విశ్వక్సేన్. తాను పెద్ద హీరోను కాకపోయినప్పటికీని, తనకున్న స్తాయిలో ఏదో బిజీగా ఉంటానని, ఒక గంట కథ విని…సినిమా చేయనని చెప్పే బదులు, అవతలివారి సమయం కూడా వృథా కాకుండ కథ వినకపోవడమే మంచిదన్నట్లుగా చెప్పుకొచ్చారు విశ్వక్సేన్. అలాగే అందరికీ నచ్చడానికి తానేం బిర్యానీని కానని, సినిమా విజయం సాధించినంత మాత్రాన మరొకరిని కించపరచడం సరికాదని విశ్వక్సేన్ చెప్పు కొచ్చారు. మరి..ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా? లేక ఇంకా కంటిన్యూ అవుతుందా? అనేది వేచి చూడాలి.
— TollywoodHub (@tollywoodhub3) July 27, 2023
తన సినిమాలో హీరోగా నటిస్తానన్న విశ్వక్సేన్ తీరు బాగోలేదని, నటుడు- దర్శక,నిర్మాత ఓ సందర్భంలో ఆరోపణలు చేయడం, ఈ విషయంపై విశ్వక్సేన్ రెస్పాండ్ అవ్వడం వంటి సంఘటనలు గుర్తుండే ఉంటాయి.