రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇటీవల రెండు రిలీజ్డేట్స్ని(మార్చి 14 లేదా ఏప్రిల్ 1) ప్రకటించింది. కానీ ఫైనల్‌గా ఈవేవి కాకుండా మార్చి 25 అంటూ కొత్త రిలీజ్‌డేట్‌ను కన్ఫార్మ్ చేసింది. సేమ్ టు సేమ్ జనవరి 31న ‘భీమ్లానాయక్’ టీమ్ ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 అంటూ రెండు రిలీజ్ డేట్స్‌ను ప్రకటించింది. తాజాగా గని చిత్రబృందం ఈ ట్రెండ్‌నే ఫాలో అయ్యింది. పరిస్థితులు సహకరిస్తే తమ సినిమాను ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తామని లేకపోతే మార్చి 4న థియేటర్స్‌కు వస్తామని ప్రకటించారు గని టీమ్.
వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ ఫిల్మ్ ‘గని’లో బాక్సర్‌గా కనిపిం చనున్నారు వరుణ్ తేజ్. అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు ముద్ద, అల్లు బాబీ నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించారు. ఉపేంద్ర, సునీల్‌శెట్టి, నవీన్చంద్రకీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్.