Sekhar Kammula: టాలీవుడ్ కొంతమంది దర్శకులు కొన్ని నిర్మాణసంస్థలు ఆస్థాన దర్శకులుగా మారిపోతున్న ధోరణులు కనిపిస్తున్నాయి. ‘అత్తారింటికి దారేది’ సినిమాతో పవన్‌కల్యాణ్‌తో కలిసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు త్రివిక్రమ్. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాత. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమాలన్నీ 2015లో వచ్చిన‘సన్నాఫ్ సత్యమూర్తి’ నుంచి మొన్న వచ్చిన ‘గుంటూరుకారం’వరకూ అన్నీ చిత్రాలను కూడా సూర్యదేవర రాధాకృష్ణచే హరిక అండ్ హాసిని బ్యానర్లో నిర్మించబడ్డాయి. కాకపోతే అల్లు అర్జున్‌తో సినిమా చేసిన ప్పుడు మాత్రం గీతా ఆర్ట్స్ భాగస్వామ్యం పంచుకుంది. ఇక హరిక అండ్ హాసిని బ్యానర్‌కు సబ్ బ్రాంచ్‌గా సితార ఎంటర్టైన్మెంట్స్ను చెప్పుకుంటారు. ఈ బ్యానర్లో వెంకీ అట్లూరి ‘రంగ్ దే’ చేశారు. నితిన్హీరోగా చేసిన ఈ సినిమా హిట్. అంతే…తన నెక్ట్స్ మూవీని «‘సార్’ని ధనుష్‌తో సితారలోనే చేశారు వెంకీ.థర్డ్ సినిమా ‘లక్కీభాస్కర్’ కూడా సితార ఎంటర్టైన్మెంట్లోనే వెంకీ ఫిక్స్ అయ్యింది. దుల్కర్సల్మాన్ హీరో.
సేమ్ ఇదే రూట్లో వెళ్తుంన్నట్లున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. నిర్మాతలు ఏషియన్ సునీల్‌నారంగ్, పుస్కూరు రామ్మోహన్‌లతో తొలిసారి ‘లవ్‌స్టోరీ’ చేశారు శేఖర్ కమ్ముల. నెక్ట్స్ మూవీని కూడా ఈ నిర్మాతలోనే చేస్తున్నారు శేఖర్ కమ్ముల. ధనుష్–నాగార్జున హీరోలుగా రూపొందుతున్న మల్టీస్టారర్ ఫిల్మ్ ఇది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాకముందే సునీల్‌నారంగ్, రామ్మోహన్‌లతో ధర్డ్ మూవీని ప్రకటించారు శేఖర్. దర్శకులు త్రివిక్రమ్, వెంకీ అట్లూరి అన్న వారి సినిమాలు విడుదలైన పిదప, సేమ్ బ్యానర్లోమరో సినిమాను ప్రకటించారు. కానీ శేఖర్‌కమ్ముల మాత్రం ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే, అదీ కూడా పదిశాంత చిత్రీకరణ పూర్తి కాకుండానే మరో కొత్త సినిమాను ప్రకటించడం అనేది ఆసక్తికరమైన విషయమనే చెప్పుకోవాలి.