SundeepKishan: సందీప్‌కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఊరిపేరు భైరవకోన’. ఫ్యాంటసీ హారర్ కామెడీగా రూపొందిన ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకుడు. ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’, ‘ఒక్కక్షణం’ వంటిసినిమాలకు దర్శకత్వం వహించిన వీఐ ఆనంద్ తాజాగా ఆ తరహాలోతీసిన సినిమా ఇది. ఇందులో వర్షా బొల్లమ్మ, కావ్యాథాపర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పణలో ‘సామజవరగమణ’ ఫేమ్ రాజేష్ దండా ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌నువిడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ మేకర్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదలకానుంది.
‘మైఖేల్’ వంటి డిజాస్టర్ తర్వాత సోలో హీరోగా సందీప్‌కిషన్ థియేటర్స్‌కు వస్తున్న సినిమా ఇది. గతంలో సందీప్‌కిషన్, వీఐ ఆనంద్ కాంబినేషన్లో వచ్చిన ‘టైగర్’ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు సందీప్, వీఐ ఆనంద్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై విజయంపై ఆసక్తి నెలకొని ఉంది ఇండస్ట్రీలో వర్గాల్లో. ఇక ఫిబ్రవరి 9న ‘ఊరిపేరు భైరవకోన’తో పాటుగా జీవా ‘యాత్ర 2’, రవితేజ ‘ఈగల్’, రజనీ కాంత్ ‘లాల్ సలామ్’ సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి.