Sharwanand: శర్వానంద్‌కి మార్చి 6, 2024 బర్త్ డే బాగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే శర్వానంద్ (Sharwanand) హీరోగా నటించిన మూడు సినిమాల ప్రకటనలు వచ్చాయి. శర్వానంద్ 35వ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘మనమే…’ అనే టైటిల్‌ను ఖరారు చేసి, ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టు విక్రమ్ ఆదిత్య ఓ పాత్ర చేస్తున్నారు. లండన్ నేపథ్యంలో సాగే న్యూ ఏజ్ రొమాంటిక్ ఫిల్మ్ ఈ చిత్రం. ఈ ఏడాదే విడుదల చేయాలను కుంటున్నారు. వివేక్ కూచిభొట్ల సహ–నిర్మాతగా ఉన్న ఈ సినిమాకు అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ డైరెక్టర్.
మూడు తరాల కథ
Team #Sharwa36 wishes @ImSharwanand a very Happy Birthday ❤️🔥
Gear up for adrenaline pumping adventure 💥💥
More updates soon!@abhilashkankara @rajeevan69 @ghibranvaibodha @dopyuvraj #Anilkumar @UV_Creations pic.twitter.com/0uUTruMSXS
— TollywoodHub (@tollywoodhub8) March 6, 2024
యూవీ క్రియేషన్స్‌తో శర్వానంద్‌కు మంచి అనుబంధం ఉంది. శర్వానంద్(Sharwa36) కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రాలైన ‘రన్ రాజా రన్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘మహానుభావుడు’ సినిమాలు ఈ నిర్మాణసంస్థ నుంచే వచ్చాయి. మరోసారి శర్వానంద్ ఈ బ్యానర్లో ఇంకో సినిమా చేస్తున్నారు. శర్వానంద్ బర్త్ డే మార్చి 6 సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. మూడు తరాల కథగా ఈ చిత్రం రానుంది. మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ బైక్ రైడర్‌గా కనిపిస్తారు. ‘లూజర్’ వెబ్‌సిరీస్ ఫేమ్ అభిలాష్ కంకర ఈ సినిమాకు దర్శకుడు. విక్రమ్ సమర్పణలో వంశీ–ప్రమోద్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్.
హిట్ డైరెక్టర్‌తో…
ఇటీవల ‘సామజవరగమణ’ సినిమాతో మంచి హిట్ ఇచ్చారు రామ్ అబ్బరాజు. ఈ దర్శకుడితో శర్వానంద్ తర్వాతి చిత్రం ఖరారైంది. అనిల్‌సుంకర, రామబ్రహ్మాం సుంకర ఈ సినిమాను నిర్మించనున్నారు. శర్వానంద్ కెరీర్లో ఈ చిత్రం 37వది((Sharwa37). విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్.
ఇక ప్రొఫెషనల్ విషయాలను పక్కన పెడితే…పర్సనల్‌గా కూడా ఈ బర్త్ డే శర్వాకు బాగా కలిసొచ్చింది. గత ఏడాది రక్షితారెడ్డిని పరిణయమాడారు శర్వానంద్. ఇటీవల రక్షిత ఓ పాపకు జన్మనిచ్చారు. ఈ పాపకు లీలా దేవి అని నామాకరణం చేసినట్లుగా వెల్లడించి, ఓ పోస్టర్‌ను షేర్ చేసుకున్నారు శర్వానంద్. ఇలా.. ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా 2024, మార్చి 6 బర్త్ డే. శర్వాకు బెస్ట్ బర్త్ డే అని చెప్పవచ్చు.