ShahidKapoor Ashwatthama: బాలీవుడ్లో హీరో విక్కీ కౌశల్, దర్శకుడు ఆదిత్యాథార్ కాంబినేషన్లో వచ్చిన ‘యురి– ది సర్జికల్ స్ట్రైక్’ సినిమా బ్లాక్‌బస్టర్. ఈ పూర్తయి ఏడాది పూర్తయిన సందర్భంగా 2020 జనవరి 11న ‘ది ఇమ్మోర్టట్ అశ్వత్థామ’ సినిమాను ప్రకటించారు విక్కీకౌశల్– ఆదిత్యా థార్. రోనీ స్క్రూవాలా నిర్మాత. కానీ ఈ సినిమాసెట్స్పైకి వెళ్లలేదు. బడ్జెట్ కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. ఆసక్తికర విషయం ఏంటంటే…ఈ సినిమాలో ఎన్టీఆర్, అల్లు అర్జున్ హీరోలుగా నటిస్తారనే ప్రచారం కూడా జరిగింది. సమంత పేరు హీరోయిన్గా తెరపైకి వచ్చింది. కానీ ఇవేవీ జరగలేదు. కానీ ఈ ప్రాజెక్ట్ స్వరూపమే మారిపోయింది.
‘అశ్వత్థామ– ది సాగా కంటిన్యూస్’ (ShahidKapoor Ashwatthama) టైటిల్‌గా షాహిద్‌కపూర్ సినిమా చేస్తున్నారు. ఇందులో అశ్వత్థామగా కనిపిస్తారు షాహిద్‌కపూర్. కన్నడంలో ‘అవనే శ్రీమన్నారాయణ’ సినిమా తీసిన సచిన్ రవి ఈ సినిమాకుదర్శకుడు.
రకుల్‌ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ, వాషు భగ్నానీ, దీప్షికా దేశ్‌ముఖ్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థియేటర్స్‌లోనే ఈ చిత్రం విడుదల కానుంది. మహాభారతంలోని అశ్వత్థామ ఇప్పటి ఆధనిక కాలంలోకి వస్తే ఏం జరుగుతుంది? అమరవీరులు ఇప్పటి కాలంలో యుద్ధాలు చేయవలసి వస్తే ఏలా ఉంటుంది? అనే కోణంలో ఈ సినిమా కథనం ఉండబోతున్నట్లుగా తెలిసింది. ఇలా బాలీవుడ్లో విక్కీ కౌశల్ చేయాల్సిన ప్రాజెక్ట్ షాహిద్‌కపూర్ చేతికి చేరింది.