RajinikanthBiopic: ధనుష్ స్టార్ హీరో. హాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. లేటెస్ట్గా ప్రముఖ సంగీత దర్శకులు ఇళయారాజా బయోపిక్ ‘ఇళయారాజా’లో ఇళయారాజా పాత్ర చేసేందుకు ధనుష్ ఒప్పుకున్నారు. ధనుష్‌తో ‘కెప్టెన్ మిల్లర్’ తీసిన అరుణ్మాథేశ్వరన్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా టైటిల్ లాంచ్ కూడా ఘనంగా జరిగింది. అయితే ఈ ఈవెంట్లో ధనుష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాను జీవితంలో నటుడిగా ఇద్దరి బయోపిక్స్లోనే నటించాలనుకున్నానని, వారిలో ఒకరు ఇళయారాజా కాగా,మరొకరు రజనీకాంత్ అని చెప్పుకొచ్చారు ధనుష్. ఇలా రజనీకాంత్ బయోపిక్ (RajinikanthBiopic)లో తాను నటించాలనుకుంటున్న ఆకాంక్షను ధనుష్ బయటపెట్టారు.
రజనీకాంత్ అల్లుడు ధనుష్. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యరజనీకాంత్ భర్త. వీరికి ఇద్దరు కుమారులు. కానీ 2022 జనవరిలో ధనుష్, ఐశ్వర్య ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత దర్శకురాలిగా ఐశ్వర్య, దర్శక–నిర్మాత, నటుడిగా ధనుష్ ఎవరికి వారు వారి వారి పనుల్లో బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రజనీకాంత్ బయోపిక్‌లో నటించడానికి తాను సిద్ధమన్నట్లుగా ధనుష్ చెప్పడం చర్చనీయాంశమైంది. ఒకవేళ రజనీకాంత్ బయోపిక్ వస్తే ఇందులో ధనుష్యే హీరోగా నటిస్తారా? ధనుష్ చేయడానికి రజనీకాంత్ ఒప్పుకుంటారా? అసలు..రజనీకాంత్ బయో పిక్ వస్తుందా? కాలమే సమాధానాలు చెప్పాలి.