‘పొన్నియిన్ సెల్వన్’, ‘విరుమాన్’ ‘సర్ధార్’ ఇలా వరుసగా సినిమాలను జెట్‌స్పీడ్‌లో కంప్లీట్ చేస్తున్నారు హీరో కార్తి. అయితే కార్తి తర్వాతి సినిమా ఎవరితో అన్న ప్రశ్నకు సమాధానంగా దర్శకుడు సతీష్ సెల్వకుమార్ పేరు వినిపిస్తోంది. ఇంతకు వరకు బాగానే ఉంది కానీ ఈ చిత్రంలో హీరోయిన్గా కొంతమంది పేర్లు తెరపైకి రాగా ఫైనల్‌గా సమంత పేరు గట్టిగా వినిపిస్తోందని కోలీవుడ్ చెబుతోంది. మరి.. కార్తి సరసన సమంత కనిపిస్తే..ఇదే వీరు తొలిసారి కలిసి నటించడం అవుతుంది. మరి..ఈ కొత్తజంట కుదురుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
మరోవైపు తమిళంలో సమంత చేసిన ‘కాదువాక్కుల రెండు కాదల్’ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఇం దులో సమంతతో పాటుగా నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించారు. నయనతార ప్రియు డు విఘ్నేష్‌శివన్ ఈ సినిమాకు దర్శకుడు. అలాగే సమంత చేసిన శాకుంతలం సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇక ప్రస్తుతం యశోద సినిమాతో బిజీగా ఉన్నారు సమంత.
మీరు అంతా రెండు రెండు బ్లాక్ చేస్తే మేము ఏడు బ్లాక్ చేయకూడదా