RavitejaEagleReview:
సినిమా: ఈగల్
ప్రధాన తారాగణం: రవితేజ, కావ్యాథాపర్, అనుపమాపరమేశ్వరన్, నవదీప్, అవసరాల శ్రీనివాస్
దర్శకుడు: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్, టీజీ విశ్వప్రసాద్
సంగీతం: డేవ్ జాంద్
విడుదల తేదీ: ఫిబ్రవరి 9
RavitejaEagleReview: హీరో రవితేజ (Raviteja), నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన ‘ధమాకా’ చిత్రం సూపర్‌హిట్‌గా నిలి చింది. ఈ చిత్రం తర్వాత రవితేజ, టీజీ విశ్వప్రసాద్ కాంబి నేషన్‌లో వస్తోన్న చిత్రం ‘ఈగల్’(Eagle). అలాగే సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకుడిగా ‘సూర్య వర్సెస్ సూర్య’వంటి ఓ డిఫరెంట్ ఫిల్మ్ తర్వాత చేసిన చిత్రం ఇది. ఇలా ‘ఈగల్’ సినిమాపై అంచనాలు ఉన్నాయి. కానీ ఫిబ్రవరిలో విడుదలైన రవితేజ గత చిత్రాలు ‘షాక్’, ‘నిప్పు’, ‘టచ్ చేసి చూడు’, ‘ఖిలాడి’..ఇలా ఏ చిత్రం హిట్ కాలేదు. ఇప్పుడు ఫిబ్రవరిలో ‘ఈగల్’ వస్తోంది. మరి..ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌తో రవితేజ మరో హిట్ అందుకున్నాడా? ఫిబ్రవరి ఫ్లాప్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేశాడా? ‘ఈగల్’ రివ్యూ చదవండి.
కథ
యూరప్‌లో కాంట్రాక్ట్ కిల్లర్ ఈగల్ ఆలియాస్ సహాదేవ్ వర్మ. అక్కడ రచన(కావ్యాథాపర్)ను చూసి ప్రేమలో పడతాడు. కానీ తాను చేసిన ఓ తప్పు వల్ల రచనను కోల్పోతాడు ఈగల్. దీంతో మారిపోయిన సహాదేవ వర్మగా మదనపల్లెలో పత్తి వ్యాపారం చేసుకుంటుంటాడు. అలాంటి సహాదేవవర్మను అతని గతం ఏ విధంగా వెంటాడుతుంది? రచనకు సహాదేవవర్మ ఏ మాట ఇచ్చాడు? ఇండియన్ రా ఎజెన్సీ సహాదేవ్ను ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటుంది? జర్నలిస్ట్ నళినీ వర్మ (అనుపమాపరమేశ్వరన్) ఎలాంటి నిజాలు తెలుసుకుంటుంది? అనేది సినిమా కథ.
విశ్లేషణ
తప్పుడు దారిలో ఉన్న హీరో, అందమైన హీరోయిన్‌తో ప్రేమలో పడడం. ఆ తర్వాత హీరోయిన్ చని పోవడం..హీరో మారిపోవడం రోటీన్ స్టోరీ. ‘ఈగల్’ బేసిక్ స్టోరీ కూడా ఇదే. కానీ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ‘ఈగిల్’ సినిమాకు స్టైలిష్ ట్రీట్మెంట్ చేశాడు. పాత్రల పరిచయం, సహాదేవవర్మ పాత్రను ఎలివేట్ చేయడం, సహాదేవ వర్మను గురించి జర్నలిస్ట్‌గా నళిని రావు నిజాలు తెలుసుకోవడం వంటి సన్నివేశాలతో తొలిభాగం ముగుస్తుంది. అయితే ఈ క్రమంలో వచ్చే ఒక్కో క్యారెక్టర్ సహాదేవవర్మ క్యారెక్టర్‌ను తెలుసుకుని ఆశ్చరపడేలా కథను ట్రీట్ చేశాడు కార్తీక్. సెకండాఫ్‌లో రోటీన్ లవ్‌ట్రాక్ ఉంటుంది. కానీ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ లోటును కనపడనివ్వకుండ చేశాడు దర్శకుడు కార్తీక్. యాక్షన్ సీక్వెన్స్‌లు అయితే రవితేజ ఫ్యాన్స్‌కు నెక్ట్స్ లెవల్లో కనిపిస్తాయి. కార్పొరేట్ ఆఫీస్‌లో పద్దతైన దాడి, మార్గశిర మధ్యరాత్రి మారణహోమం యాక్షన్ సీక్వెన్స్‌లు అయితే ఇంగ్లీష్ సినిమాలను గుర్తుకు తెస్తాయి. అయితే హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్ చేయడానికి కథలో చాలా క్యారెక్టర్లు ఉంటాయి. అలాగే నక్సలిజం, టెర్రలిస్ట్లు, ఆర్మీ…ఇలా కథలో లేయర్స్ ఉన్నా..రవితేజ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ వీటిని డామినేట్ చేస్తుంది. కొన్ని ప్రవచనాల డైలాగ్స్ బోర్ కొడతాయి. ప్రతి క్యారెక్టర్ సహాదేవ్ను ఆకాశానికి ఎత్తేయడం కాస్త ఇబ్బందే. రవితేజను ఓ లార్జర్‌దేన్ లైఫ్ క్యారెక్టర్లో చూస్తారు ఆడియన్స్. యాక్షన్‌లో కామెడీ పెట్టే ప్రయ త్నం చేశాడు దర్శకుడు. ఇది బలవంతపు కామెడీగా ఉంటుంది. ఎండిటింగ్లో తీసేసినా పెద్ద ఫరక్ పడదు.
పెర్ఫార్మెన్స్
ఈగల్ ఆలియాస్ సహాదేవవర్మగా రవితేజ బాగా చేశారు. ‘ఈగల్’గా స్టైలిష్ లుక్‌లో, సహాదేవవర్మగా మధ్యవయస్కుడిగా పాత్రల మధ్య వేరియేషన్స్ చూపించారు. స్టైలిష్ యాక్షన్, స్టైలిస్ యాక్టింగ్ చేశారు. ఎమోషన్ మాత్రం కాస్త తక్కువైంది. జర్నలిస్ట్ నళిని వర్మగా అనుపమాపరమేశ్వరన్కు మంచి రోల్ పడింది. సినిమా కథ అంతా నళిని నరేటివ్ పాయింట్ ఆఫ్వ్యూలోనే సాగుతుంది. ‘ఈగల్’ అసిస్టెంట్ ‘జై’గా నవ దీప్, ‘రా’ ఎంజెంట్గా అవసరాల శ్రీనివాస్. మదనపల్లె లోకల్ ఎమ్.ఎల్.ఏ సోమేశ్వర్రెడ్డిగా అజయ్ ఘోష్, ఎమ్.ఎల్.ఏ పీఏ వికాస్(శ్రీనివాసరెడ్డి) పాత్రలు నవ్వించే ప్రయత్నం చేశాయి. ‘రా’ అధికారిగా మధుబాల, కొర్పొరెట్ బిజినెస్‌మ్యాన్‌గా నితిన్ మెహతా, యూరప్‌లో ఓ డాన్‌గా వినయ్‌రాయ్ పాత్రల పరిధిమేరకు కనిపిస్తారు. యాక్టింగ్ స్కోప్ లేదు. అయితే ఓ రోటిన్ కథను స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా కార్తీక్
బాగా తీశాడు. చివర్లో ఉన్న ఓ ట్విస్ట్ కూడా ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుంది. అక్రమ ఆయుధాల రవాణా దేశానికి ముప్పు అంటూ ఓ సందేశం ఇవ్వడం కూడా బాగుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వె న్స్…యాక్షన్ లవర్స్‌కు కిక్ ఇస్తాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ‘ఈగల్’ సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. మ్యూజిక్ డైరెక్టర్ దేవ్జాంద్కు ‘ఈగల్’ తొలి సినిమా అంటే నమ్మశక్యంగా ఉండదు. ‘ఆర్ఆర్’ అదరగొట్టాడు. సాంగ్స్‌కు పెద్ద ఆస్కారం లేదు. ఇంకాస్త ఎడిటింగ్ చేసి ఉండొచ్చు.
బలాలు
రవితేజ యాక్టింగ్
యాక్షన్ సీక్వెన్స్‌లు
నిర్మాణ విలువలు
బలహీనతలు
రోటీన్ లవ్‌ట్రాక్
బలవంతపు కామెడీ
ప్రవచనాల డైలాగ్స్
ఓవర్ ఎలివేషన్
ఫైనల్: పద్ధతైన యాక్షన్ డ్రామా ‘ఈగల్’(2.75)