రామ్ (Ram Pothineni )హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘స్కంద’ (Skanda- The Attacker) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘ది ఎటాకర్’ అనేది ఊపశీర్షిక. ఈ చిత్రంలో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ‘స్కంద’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా డుబుల్ ఇస్మార్ట్ అనే సినిమా రూపొందనుంది. రామ్, పూరీ కాంబినేషన్లో వచ్చిన హిట్ ఫిల్మ్ ‘ఇస్మార్ట్‌శంకర్’కు ఈ చిత్రం సీక్వెల్. వచ్చే ఏడాది శివరాత్రి సందర్భంగా ఈ సినిమాను మార్చి 18న విడుదల చేయనున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు.