Rakul Preet Singh: హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ (Rakul Preet Singh) ఓ ఇంటి కోడలైంది. బాలీవుడ్ నిర్మాత– నటుడు జాకీ భగ్నానీ(Jackky Bhagnani) తో రకుల్‌ప్రీత్‌సింగ్ వివాహం ఫిబ్రవరి 21, 2024న సౌత్గోవాలో అంగరంగవైభవంగా జరిగింది.కేవలం బంధుమిత్రులు, సన్నిహిత వర్గాలు, కొందరు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలోనేజాకీ భగ్నానీ, రకుల్‌ప్రీత్‌సింగ్‌ల పెళ్లి జరిగింది. వరుణ్‌ధావన్, నటషాదలాల్, అక్షయ్‌కుమార్,టైగర్‌ష్రాఫ్, అనన్యాపాండే, ఆదిత్యారాయ్కపూర్, శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా, ప్రగ్యాజైస్వాల్ ఇలాపలువురు సెలబ్రీటీలు రకుల్, జాకీ భగ్నానీల పెళ్లి వేడుకలో పాల్గొని, సందడి చేశారు. ఇక కొన్నిసంవత్సరాలు సీక్రెట్‌గా డేటింగ్ చేసుకున్న రకుల్– జాకీ భగ్నానీ తొలిసారిగా 2021 అక్టోబరులోతమ రిలేషన్‌ను గురించి అధికారికంగా ప్రకటించారు. 2024 ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు.రిసెప్షన్‌ను ముంబైలో గ్రాండ్‌గా నిర్వహించాలనుకుంటున్నారని తెలిసింది.
ఇక జాకీభగ్నానీ–రకుల్‌ప్రీత్‌సింగ్‌ల వివాహం మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో జరగాల్సింది. ఏర్పాట్లను కూడా మొదలుపెట్టారు. కానీ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోది ఇటీవల ఓ సందర్భంగా మాట్లాడారు. భారతీయ సెలబ్రీటీలు స్వదేశంలోనే వివాహం చేసుకోవాలని, తద్వారా దేశానికిఎంతో కొంత మేలు చేసినవారవుతారని అన్నారు. ఇలా రకుల్–జాకీల డెస్టివేషన్ వెడ్డింగ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి గోవాకు షిప్ట్ అయ్యింది.