RajinikanthLalSalaamReview: ‘త్రీ’, ‘వాయ్ రాజా వాయ్’ వంటి సినిమాల తర్వాత రజనీకాంత్కుమార్తె ఐశ్వర్యారజనీకాంత్(Aishwarya Rajinikanth) దర్శకత్వం వహించిన పీరియాడికల్మూవీ ‘లాల్‌సలామ్’. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ఐశ్వర్యారజనీకాంత్ డైరెక్షన్లో సినిమా వస్తుండటం, ఇందులో రజనీకాంత్ ఓ లీడ్ రోల్ చేయడం, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అనగానే ఈ ‘లాల్‌సలామ్’ సినిమాపై అంచనాలు ఉన్నాయి తమిళ ఇండస్ట్రీలో. పైగా ‘జైలర్’ తర్వాత రజనీకాంత్ థియేటర్స్‌లో వస్తున్న చిత్రం కావడంతో ఆడియన్స్‌కు ‘లాల్‌సలామ్’ సినిమా పట్ల ఆసక్తి కలిగింది. మరి.. ఈ సినిమా ఆడియన్స్‌ను మెప్పిచిందా? రివ్యూలో చూద్దాం.
ప్రధాన తారాగణం: రజనీకాంత్, విష్ణువిశాల్, విక్రాంత్, జీవితారాజశేఖర్
దర్శకురాలు: ఐశ్వర్యారజనీకాంత్
నిర్మాతలు: లైకాప్రొడక్షన్స్ సుభాస్కరన్
మ్యూజిక్: ఏఆర్ రెహమాన్
విడుదల: ఫిబ్రవరి 9, 2024
కథ
కసుమూరు గ్రామంలో 1993లో జరిగే కథ ఇది. ఈ గ్రామంలో హిందులు, ముస్లింలు ఐక్యమత్యంగా జీవి స్తుంటారు. ఈ గ్రామంలో త్రీస్టార్స్ అనే ఓ క్రికెట్ టీమ్ ఉంటుంది. ఇందులో ఉన్న ఒకే ఒక నాన్–ముస్లిం క్రికెటర్ గురునాథం(విష్ణువిశాల్). ఈ టీమ్‌కు ప్రధాన కీ ప్లేయర్ కూడా గురునాథంనే. కానీ కొన్ని కారణాల వల్ల ఎమ్‌సీసీ అనే కొత్త క్రికెట్ టీమ్‌ను స్టార్ట్ చేస్తాడు గురునాథం. ఈ టీమ్‌లో అందరూ హిందువులే. గురునాథం ఎమ్సీసీతో పోటీ పడిన ప్రతిసారి త్రీస్టార్స్ టీమ్ ఓడిపోతూనే ఉంటుంది. అలా 93సార్లు ఓడిపోయిన తర్వాత ఎలాగైన గెలవాలని త్రీస్టార్ టీమ్స్ వాళ్లు ముంబై నుంచి క్రికెటర్ శంషుద్దీన్‌ను తీసుకువస్తారు. కానీ త్రీస్టార్స్ టీమ్ ఓడిపోతుంది. దీంతో ముంబై ప్లేయర్ శంషుద్దీన్ అవమానంగా ఫీలవుతాడు. ఎలాగైనా ఎమ్‌సీసీ టీమ్‌పై గెలవాలని, వెంటనే మరో టోర్నమెంట్ జరిగేలా ప్లాన్ చేయాలనిత్రీస్టార్ టీమ్ నిర్వహాలను అడుగుతాడు. కొత్త టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. త్రీస్టార్, ఎమ్‌సీసీ టీమ్ ఫైనల్ ఓవర్లో రెండు జట్ల మధ్య గొడవ వస్తుంది. ఈ దొమ్మిలో శంషుద్దీన్ చేయి నరుకుతాడు గురునాథం.అంతే గ్రామంలో మతఘర్షణలు చేలరేగుతాయి. మరోవైపు ముంబై తరఫున రంజీకీ సెలక్ట్ అయిన తన కొడుకు శంషుద్దీన్ చేయికోల్పోవడం మొయిద్దీన్భాయ్ని తీవ్రంగా బాధపెడుతుంది. గురును అరెస్ట్ చేస్తారు. అయితే జామీను మీదు గురు తిరిగి వచ్చిన తర్వాత పక్క ఊరు వెంకటాచలంకి చెందిన కాశీతో గొడవపడతాడు. దీంతో తేరు జాతర రోజున, ఊరి పెద్ద కనకరాజును అవమానించి, జాతరలో కీలకమైన తేరును తన ఊరికి తీసుకునివెళతాడు కాశీ. ఊర్లో మత ఘర్షణలు చేలరేగడానికి, జాతర ఆగిపోవడానికి గురునాథమే కారణమని భావించిన ఊరు జనం అతన్ని ఊర్లో నుంచి పంపేస్తారు. అతని తల్లి రాణికూడా గురునాథంను ఊరి నుంచి వెళ్లిపోమంటుంది. ఓ వైపు గురునాథంపై పగ తీర్చుకోవడానికి శంషుద్దీన్ ఎదురు చూస్తున్నాడు? మరోవైపు ఎలాగైనా జాతర జరిపించి ఊరికి దగ్గర కావాలని గురునాథం కోరు కుంటున్నాడు. మరోవైపు సొంతఊర్లోని గొడవలు సద్దుమణగాలని మొయిద్దీన్భాయ్ కోరుకుంటున్నాడు. మరి..ఎవరు ఎలా వారి లక్ష్యాలను చేరుకున్నారు? అన్నదే ఈ చిత్రం కథ.
విశ్లేషణ
హిందు –ముస్లీం గొడవలు, మతఘర్షణలు అనేది చాలా పాత కాన్సెప్ట్. సాధారణంగా ఈ మతఘర్షణలకు టెర్రరిజం, కశ్మీర్బ్యాక్డ్రాప్, మెయిన్‌స్ట్రీమ్ పొలిటికల్ అంశాలను సెలక్ట్ చేసుకుంటుంటారు ఫిల్మ్‌మేకర్స్. కానీ దర్శకులురాలు ఐశ్వర్యారాజేష్ మాత్రం కొత్తగా ఆలోచించి క్రికెట్ నేపథ్యాన్ని తీసుకున్నారు. పొలిటికల్
యాంగిల్ ఉన్నా అది అండర్కవర్గానే ఉంటుంది. కథ ఎత్తుగడ, సీన్ ఓపెనింగ్ బాగానే ఉన్నాయి. క్రికెట్ మ్యాచ్‌తో జరిగే గొడవతోనే సినిమా మొదలవుతుంది. కాస్త ఆసక్తిని కలిగించేలా అనిపిస్తుంది. కానీ కథ కాస్త ముందుకు కదలగానే ప్రేక్షకులు సాగదీత సన్నివేశాలతో ఇబ్బందిపడతారు. గురునాథం ఇంట్రడక్షన్, మొయిద్దీన్భాయ్, అతని కొడుకు శంషుద్దీన్‌ల క్యారెక్టరైజేషన్ల ఎస్టాబ్లిష్మెంట్లతోనే తొలిభాగం మేజర్ పార్ట్ పూర్తవుతుంది. జాతర ఆగిపోవడంతో ఇంట్రవెల్ పడుతుంది. గురునాథం తన తప్పు తాను గ్రహించి, తన బలాన్ని తెలుసుకుని జాతర జరపించాలనుకోవడం, శంషుద్దీన్లోని పగను నీరుగార్చాలని మొయిద్దీన్
చేసే ప్రయత్నాలతో సెకండాఫ్ సాగుతూ, ముంబైలో జరిగే మరో మతఘర్షణలో గురు, శంషుద్దీన్లు కల వడంతో కథ క్లైమాక్స్‌కు చేరుతుంది. చెప్పడానికి బాగానే ఉన్నా స్క్రీన్‌పై మాత్రం ఇది అంత క్లీన్‌గా ఉండదు. మధ్యలో వచ్చే గురు లవ్‌ట్రాక్, పెంచలయ్య క్యారెక్టర్ ఎక్స్ట్రా ఎమోషన్, గురునాథం తల్లి రాణి ఓవర్ యాక్టింగ్‌లతో సినిమా బోరుకోడుతూనే ఉంటుంది. ఆడియన్స్‌కు ముట్టికాయలు వేస్తూనే ఉంటుంది.
ఇక కండీషన్ బెయిల్‌పై ఉన్న వ్యక్తి సొంత ఊర్లో ఉండకుండ తేరు జాతర విరాళల కోసం ముంబై వెళ్లడం, అక్కడ సన్నివేశాలు ఐశ్వర్యారాజేష్లోని దర్శకత్వ లోపానికి ఓ నిదర్శనం. అయితే మొయిద్దీన్ ఎంట్రీ, సెకండాఫ్‌లో దేశభక్తిని గురించి మెయిద్దీన్ చెప్పే డైలాగ్స్, క్లైమాక్స్‌లో జాతర జరిపించడం కోసం ముస్లిం ఏకమై ఓ నిర్ణయం తీసుకోవడం వంటి అంశాలు రోటీన్‌గా ఉన్నా మరోసారి ఆడియన్స్‌ను ఆలోజింప చేస్తాయి. కానీ విలన్ రోల్ చేసిన కాశీ పాత్ర క్లైమాక్స్ పేలవంగా ఉంటుంది. హీరో ఇంటికి వచ్చిన ప్రతిసారి అతని అమ్మ అతన్ని కొడుతూనే ఉండటం ఆడియన్స్‌కు విసుగు. ఒకసారి వస్తే ఒకే. కానీ పదే పదే ఆ సీన్స్ రిపీట్ అవుతూ ఆడియన్స్‌ను చికాకు పెట్టిస్తాయి.
పెర్ఫార్మెన్స్
గురునాథం పాత్రలో విష్ణువిశాల్ చాలా సీరియస్ రోల్ చేశాడు. మంచి యాక్టింగ్ చూపించాడు. విష్ణువిశాల్ స్థాయిలో కాదు కానీ శంషుద్దీన్ పాత్రలో విక్రాంత్ బాగా చేశాడు. మొయిద్దీన్భాయ్గా రజనీకాంత్ యాక్టిం గ్ బాగానే ఉంది. రెండు మూడు ఎలివేషన్ షాట్స్ పడ్డాయి. మరో రెండుమూడు ఉంటే బాగుండేది. హాస్పిటల్లో రజనీకాంత్ ఎమోషనల్ సీన్ ఆడియన్స్‌ను కాస్త కంటతడి పెట్టిస్తాయి. శంషుద్దీన్‌కు కోచ్గాకపిల్దేవ్, ఊరిపెద్ద కనకరాజుగా కేఎస్ రవికుమార్ పాత్రలు ఫర్వాలేదు. గురునాథం తల్లి రాణిగా జీవితా రాజశేఖర్ పాత్ర బాగానే ఉంది. ఆమె కూడా బాగానే చేశారు. కానీ ఎమోషన్ ఓవర్‌డోస్‌గా, అతిగా అనిపిస్తుంది. కెమెరా విష్ణు పనితనం బాగుంటుంది. ఎడిటర్ ప్రవీణ్భాస్కర్కు చాలా పనిమిగిలిపోయిన్లుగాఉంటుంది. ఇక ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్ అవుతారనుకున్న ఏఆర్ రెహమాన్ తన మార్క్‌ను చూపించలేకపోయారు.
బలాలు
రజనీకాంత్, విష్ణువిశాల్, విక్రాంత్‌ల యాక్టింగ్
బలహీనతలు
కన్ఫ్యూజ్డ్ స్క్రీన్ ప్లే
అవుట్‌డేటెడ్ స్టోరీ
మ్యూజిక్
నిడివి
బాటమ్ లైన్: లాల్‌సలామ్ మ్యాచ్ ఫెయిల్ (2