‘అన్నాత్తే’(తెలుగులో ‘పెద్దన్న’) తర్వాత రజనీకాంత్ తర్వాతి చిత్రం ఏమిటి? అన్న విషయంపై ఇప్పటి వరకు ఓ క్లారిటీ రాలేదు. కేఎస్ రవికుమార్, పెరియస్వామి, మురుగదాస్,కార్తిక్ సుబ్బరాజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ..ఇలా కొంతమంది దర్శకుల పేర్లు వినిపించాయి. తాజాగా మరో దర్శకుడి పేరు వినిపిస్తోంది. ప్రస్తు తం విజయ్‌తో బీస్ట్ సినిమా తీస్తోన్న దర్శకుడు నెల్సన్‌కుమార్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల నెల్సన్ కుమార్ ఓ కథ వినిపించగా, రజనీ మెచ్చుకున్నారట. వీరి కాంబినేషన్లోని సినిమాను సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మించనుందని కోలీవుడ్ వినికిడి. అలాగే విజయ్‌తో బీస్ట్ సినిమాను కంప్లీట్ చేసిన తర్వాతే రజనీకాంత్ సినిమా స్టార్ట్ అవుతు ందన్నది కోలీవుడ్ సమాచారం. ఇక విజయ్ బీస్ట్ ఈ వేసవిలో విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది.
రజనీకాంత్ 169వ చిత్రం ఫిక్స్ ?
Leave a comment
Leave a comment