ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్ ఇచ్చారు రవితేజ. జనవరి 26న రవితేజ బర్త్ డే. ఈ సందర్భంగా రవితేజ తాజా చిత్రాలు ‘ఖిలాడి’, ‘ధమాకా’, ‘రామారావు: ఆన్ డ్యూటీ’ చిత్రాల అప్డేట్స్ వచ్చాయి. ఫిబ్రవరి 11న విడుదల కానున్న ‘ఖిలాడి’ సినిమా నుంచి ‘పుల్ కిక్కు’ అనే లిరికల్ వీడియో విడుదలైంది. రమేష్ వర్మ దర్శ కత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో డింపుల్ హయతి, మీనాక్షీ చౌదరి హీరోయిన్స్. ఇక శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా చేస్తోన్న ‘రామారావు: ఆన్ డ్యూటీ’ చిత్రం నుంచి కొత్త పోస్టర్ వచ్చింది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 25న థియేటర్స్‌లో విడుదల కానుంది. అలాగే నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ హీరోగా చేస్తోన్న ‘ధమాకా: డబుల్ ఇంపాక్ట్’ చిత్రం నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ఈ సినిమాలతో పాటుగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’, వంశీ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ సినిమాలు కమిటైయ్యారు రవితేజ.
ట్రిపుల్ ట్రీట్
Leave a comment
Leave a comment