ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోంది. కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే ఈ సినిమా మాత్రం వచ్చే ఏడాదిలో రిలీజ్ అవుతుంది. 2024 ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లుగా చిత్రంయూనిట్ న్యూ ఇయర్ సందర్భంగా వెల్లడించింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. కానీ ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం కాస్త నిరాశపడ్డారు.
ఈ సినిమా కాకుండ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా కమిటైయ్యారు. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో 31వ సినిమా. అయితే ఈ చిత్రం షూటింగ్ 2024 చివర్లో స్టార్ట్ కానుంది. 2026లో రిలీజ్ కావొచ్చు. 2022లో ఆర్‌ఆర్‌ఆర్‌లో ఓ హీరోగా వెండితెరపై కనిపించిన ఎన్టీఆర్ మళ్లీ 2024లో కనిపిస్తారు. ఈ నెక్ట్స్ 2026లో కనిపిస్తారు. ఇలా రానున్న నాలుగు సంవత్సరాల్లో ఎన్టీఆర్ స్క్రీన్‌పై కనిపించేది మాత్రం రెండు సార్లే అన్నట్లుగా తెలుస్తోంది.