నయనతార ప్రధాన పాత్రలో నటించిన 75వ చిత్రం ‘అన్నపూరణి’. నీలేష్ కృష్ణ దర్శకుడు. సనాతన బ్రహ్మాణ కుటుంబంలో జన్మించిన యువతి అన్నపూరణి దేశంలోనే నెంబర్ 1 చెఫ్ కావాలనుకుంటుంది. దీంతో నాన్–వెజ్ వంటకాలను కూడా చేయాల్సి వస్తుంది. అలా జీవితంలో అన్నపూరణి ఎలా ఎదిగింది? అన్నదే ఈ సినిమా కథనం. డిసెంబరు1న థియేటర్స్‌లో ఈ సినిమా విడుదలైంది. డీసెంట్ టాక్ వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ మొదలైంది. బ్రహ్మాణ యువతి పాత్రలో నటిస్తూ, నాన్–వెజ్ వంటకాలను వండటం, తినడం అనేవి కరెక్ట్ కాదని కొన్ని బ్రహ్మాణసంఘాలు ఈ సినిమాను వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో ముంబైలో కేసులు నమోదైయ్యాయి. దీంతో ఓటీటీ సంస్థ ‘అన్నపూరణి’ స్ట్రీమింగ్‌ను నిలిపివేసింది. కాగా ఈ విషయంపై నయనతార స్పందించారు.
The intention behind #Annapoorani was to uplift & inspire but not to cause distress, says #Nayanthara in her apology note. pic.twitter.com/wlvOnUs9Fa
— TollywoodHub (@tollywoodhub8) January 19, 2024
‘‘నేను కావాలని అన్నపూరణి సినిమా చేయలేదు. ఓ లక్ష్యం కోసం చేసే పోరాటంలో వెనక అడుగు ఉండకూడదు అనే సానుకూలమైన ఆలోచనలతోనే ఈ సినిమా చేశాను. దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు తరుచూ వెళ్తుంటాను. అలాంటి నేను కావాలని ఇలా ఎలా చేస్తాను? మా సినిమా ఇంటెన్షన్‌ను అర్థం చేసుకోండి. ఒకవేళ మా సినిమా వల్ల ఎవరైనా ఇబ్బందిపడితే, వారి మనోభావాలుదెబ్బతింటే వారికి నా క్షమాపణలను తెలియజేస్తున్నాను’’ అంటూ ఓ లేఖను విడుదల చేశారు నయనతార.